ఓ బేబీగా సమంత థియేటర్స్ లో సందడి చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ తో ఘనవిజయం దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. ఆదివారం రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమంత వైట్ డ్రెస్ లో వచ్చింది. 

ఫోటో షూట్ లో భాగంగా సమంత తన సీక్రెట్ టాటూ బయటపడే విధంగా ఫోజు ఇచ్చింది. పక్కటెముకలు పైభాగాన ఉన్న ఈ టాటూ అందరిని ఆకర్షించింది. సమంత సీక్రెట్ గా దాచిపెట్టిన ఆ టాటూ మరెంటో కాదు.. తన భర్త నాగ చైతన్య పేరు. ఈ విషయాన్ని సమంతే సోషల్ మీడియాలో తెలిపింది. 

నా జీవితం చాలా ఉత్తమంగా సాగిపోతోంది.. ఇంతకాలం నేను దాచిపెట్టిన టాటూని బయటపెడుతున్నా.. నా భర్త నాగ చైతన్యే నా ప్రపంచం అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గతంలో కూడా సమంత చేతిపై ఉన్నా టాటూ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి టాటూనే నాగ చైతన్య చేతిపై కూడా కనిపించడంతో హాట్ టాపిక్ గా మారింది.