దక్షిణాది స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు. తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవార్లు ఆరు మిలియన్లకు పైగా ఉన్నారు. ఇక ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఏడు మిలియన్లు దాటేసింది.

ఆమె ఏదైనా పోస్ట్ పెట్టినా, ఫోటో పెట్టినా లక్షల కొద్దీ లైక్ లు వస్తుంటాయి. ఇప్పుడు తన ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. సమంత ఫాలోయింగ్ గురించి తెలుసుకున్న చాలా కంపనీలు ఆమెతో ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. 

సోషల్ మీడియా ద్వారా కొన్ని బ్రాండ్ లకు ప్రచారం కల్పిస్తున్నందుకు సమంత ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సాధారణంగా సోషల్ మీడియాలో తన అకౌంట్ ల ద్వారా పలు బ్రాండ్ లకు ప్రచారం కల్పించడానికి దక్షిణాది సినీ హీరోయిన్లు రూ.3 లక్షల నుండి రూ.4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

కానీ సమంత మాత్రం వాళ్లందరినీ దాటేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడానికి రూ.15 లక్షల వరకూ తీసుకుంటుందట. సినిమాలు, యాడ్స్ తోనే కాకుండా సమంత ఇలా కూడా సంపాదించేస్తోంది.