సారాంశం

సమంత రియల్‌ లైఫ్‌కి, `ఖుషి` సినిమా స్టోరీకి సంబంధం ఉందనే వార్త తెరపైకి వచ్చింది. దీంతో తాజాగా దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. 

సమంత, విజయ్‌ దేవరకొండ కలిసి `ఖుషి` సినిమాలో నటించారు. శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్‌ కాబోతుంది. అయితే `ఖుషి` ప్రేమ కథతో రూపొందుతుంది. ప్రేమించుకున్న జంట ఫ్యామిలీని ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి. అవి అనేక సమస్యలకు దారితీస్తాయనేలా `ఖుషి` ట్రైలర్ ఉంది. ఈ నేపథ్యంలో సినిమా సమంత రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందనే కామెంట్లు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో సమంత రియల్‌ లైఫ్‌కి, `ఖుషి` సినిమా స్టోరీకి సంబంధం ఉందనే వార్త తెరపైకి వచ్చింది. దీంతో తాజాగా దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు.  సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు ఎలాంటి పోలికలు, సంబంధం లేదన్నారు. తాను మూడేళ్ల క్రితమే రాసుకున్న కథ అని తెలిపారు. సమంతతో తాను `మజిలీ` సినిమా చేశాను కాబట్టి, తను బాగా నటించగలదనే నమ్మకంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశామని తెలిపారు. తాను రాసిన పాత్రలో నటించింది తప్పితే, తన వ్యక్తిగత జీవితాన్ని ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. 

మరోవైపు ఈ సినిమాతో ఓ వింటేజ్‌ సమంతని చూస్తారని తెలిపారు. సమంత ప్యూర్‌ లవ్‌ స్టోరీ చేసి చాలా ఏళ్లు అవుతుంది. `ఏం మాయ చేసావే` లాంటి ఒక వింటేజ్‌ సమంతని ఇందులో చూడబోతున్నారని అన్నారు. ఆమె పాత్ర కొత్తగా చాలా ఫ్రెష్‌గా ఉంటుందన్నారు. అయితే `ఖుషి` రెగ్యూలర్‌ లవ్‌ స్టోరీ కాదని, ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉంటుందన్నారు. మరోవైపు ట్రైలర్‌ లో చూపించింది మాత్రమే కాదు, కనిపించనిది చాలా ఉందని, ఓ సెన్సిటిల్‌ ఇష్యూని ఇందులో చర్చించబోతున్నారట. కాంటెంపరరీగా ఉంటుందన్నారు దర్శకుడు శివ నిర్వాణ. 

`లవ్‌ స్టోరీస్‌, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమస్యలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో టైటిల్ కు తగినట్లుగా ఎంటర్ టైన్ మెంట్ తో కథను చెప్పాలని అనుకున్నాను. ట్రైలర్ లో ఎంటర్ టైన్ మెంట్ తో ఉన్న సీన్స్ చూశారు. ఇవన్నీ థియేటర్ లో హార్ట్ టచింగ్ గా ఉంటాయి. `డియర్ కామ్రేడ్` సినిమా తర్వాత విజయ్ కి ఈ కథ చెప్పాను. కథ చెప్పిన ఏడాదిన్నర తర్వాత సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాం. నేను `నిన్ను కోరి`, `మజిలీ`, `టక్ జగదీశ్` చేసిన తర్వాత ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీ చేయాలనుకున్నా. 

ఇక విజయ్‌ దేవరకొండ పాత్ర గురించి చెబుతూ, ఆయన పాత్రలో మంచి కామెడీ టైమింగ్‌ ఉంటుందట. `పెళ్లి చూపులు`, `గీత గోవిందం` లో ఒకలాంటి కామెడీ టైమింగ్‌ కనిపిస్తే, `ఖుషి`లో చాలా స్టయిలీష్‌గా ఉంటుందన్నారు.  ఆయన పాత్ర అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు  బాగా నచ్చుతుందని చెప్పారు. టైటిల్ యూనివర్సల్‌గా ఉండాలని, సరదాగా ఉండాలనే ఉద్దేశ్యంతో `ఖుషి` టైటిల్‌ పెట్టినట్టు చెప్పారు. 

తాను దర్శకుడిగా ఈ చిత్రానికి 12-15కోట్లు పారితోషికం తీసుకున్నారనే రూమర్లపై శివ నిర్వాణ స్పందించారు. ఈ వార్త తెలిసి ఫ్రెండ్స్ సైలెంట్‌గా బాగానే సంపాదిస్తున్నావంటున్నారు. మా అమ్మ కూడా ఫోన్‌ చేసి రెమ్యూనరేషన్‌ గురించి మాట్లాడింది. ఈ వార్తలతో నేను షాక్‌ అయ్యాను. మాలాంటి దర్శకులకు అంత పారితోషికం ఎవరిస్తారండీ అంటూ ప్రశ్నించారు. దర్శకుడికే అంత ఇస్తే, హీరో పారితోషికం కలిస్తే యాభైకోట్లు అవుతుంది. మరి సినిమా బడ్జెట్‌ ఇంకెంత కావాలి. అవన్నీ నిజం కావన్నారు. దర్శకుడిగా తనకు మణిరత్నం స్ఫూర్తి అని, అందుకే `నా రోజా నువ్వే, గీతాంజలి నువ్వే` అనే పాటని రాశానని తెలిపారు.