హీరోయిన్ సమంత (Samantha) పుష్ప మూవీలోని స్పెషల్ సాంగ్ తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలోనూ సంచలనమైన పోస్ట్ లు పెడుతోంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్ వరుస చిత్రాలతో అలరిస్తోందీ బ్యూటీ. ప్రస్తుతం శాకుంతలం, యశోద చిత్రాల్లో నటిస్తోంది. ఎంత బిజీ షూటింగ్ లో ఉన్న.. ఫ్యాన్స్ ను మాత్రం సోషల్ మీడియా వేదికన పలకరిస్తూనే ఉంది సమంత. తాజాగా సమంత చేసిన పోస్ట్ దాదాపుగా కోటిన్నర లైక్‌లతో ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది.
ఇంతకీ సమంత పోస్ట్ చేసిన పోస్ట్ లో ఏముందంటే.. సమంతా ఒక చెట్టును కౌగిలించుకున్నట్లు కనిపిస్తుంది, వైట్ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపిస్తుంది. మేకప్ లేని లుక్‌తో, పోనీటైల్‌లో ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ‘ఫ్రీ హగ్స్’ అంటూ క్యాప్షన్స్ ఇచ్చింది. దీంతో సమంత ఎవరికీ ఫ్రీ హగ్స్ ఇస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) కూడా సమంత పోస్ట్ కు స్పందించింది. ఫ్రీ హగ్స్ అంటూ ఇచ్చిన క్యాప్షన్ ను ‘ఆవ్’ అంటూ కామెంట్ పెట్టింది.
ఈ ఫొటోలో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చెట్టుకు ఫ్రీ హగ్స్ ఇచ్చాననే ఉద్దేశంతో సమంత ఇచ్చిన క్యాప్షన్ ఇంటర్నెట్ లో రచ్చగా మారింది. నెటిజన్లు కూడా ‘మేమూ చెట్లమే’ అంటూ కామెంట్ లో తెలుపుతున్నారు. మరికొంతమంది అభిమానులు నేచర్ పట్ల సమంత చూపించే ప్రేమకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రక్రుతికి దగ్గరగా ఉండాలనుకునే సమంత వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ఎప్పుడూ గ్లామర్ ఫొటోలతో రచ్చచేసే సమంత... ప్రస్తుతం వైట్ అండ్ వైట్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ దుస్తుల్లో చాలా ఆనందంగా ఉన్నావని కామెంట్లలో తెలుపుతున్నారు.
