సమంత సూసైడ్ బాంబర్ రాజి గా నెగెటివ్ రోల్ చెయ్యడం వారికి నచ్చటం లేదు. అందులోనూ సీజన్ 2 ని చెన్నై లో తీశారు. సమంతని రాజీ అనే శ్రీలంక తమిళ తిరుగుబాటుదారురాలిగా చూపించడం తమిళియన్స్ కి ఇష్టపడటం లేదు.
మనోజ్‌బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన హిందీ వెబ్ సీరీస్ చిత్రం ‘ది ఫ్యామిలీ మ్యాన్’. ఈ సినిమాకి సీరీస్‌కు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్- 2’ తెరకెక్కింది. ప్రముఖ నటి సమంత నటిస్తున్నఈ వెబ్‌సీరీస్ ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదల కానుందని ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల మరికొంత ఆలస్యమైంది.తాజాగా ఈ సీరిస్ ట్రైలర్‌ని మే 19న విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రొమోలో సమంతకు సంబంధించిన పాత్ర పరిచయం చేసారు. ఈ క్యారక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినీ ప్రముఖులు సమంత నెగెటివ్ పెరఫార్మెన్స్ ని తెగ మెచ్చేసుకుంటున్నారు.
అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై ఇప్పుడు తమిళులు విషం చిమ్మటం మొదలెట్టారు. ఆ ట్రైలర్ లో సమంత తమిళ్ లో మాట్లాడుతూ అందరిని చంపేస్తాను అంటూ చెప్పిన డైలాగ్ వారి కోపానికి కారణం అయ్యింది. సమంత సూసైడ్ బాంబర్ రాజి గా నెగెటివ్ రోల్ చెయ్యడం వారికి నచ్చటం లేదు. అందులోనూ సీజన్ 2 ని చెన్నై లో తీశారు. సమంతని రాజీ అనే శ్రీలంక తమిళ తిరుగుబాటుదారురాలిగా చూపించడం తమిళియన్స్ కి ఇష్టపడటం లేదు.
దాంతో #Familyman2_Against_Tamils అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున సమంత ని టార్గెట్ చేస్తున్నారు. తమిళ సినిమాలతో పాపులారిటీ సంపాదించిన సమంత అలాంటి టెర్రరిస్ట్ రోల్ ఎలా చేస్తుంది అని, అలాగే ఈ సీరీస్ లో తమిళులని టెర్రరిస్టులుగా చూపటమే కాక తమిళనాడు వ్యక్తులకు ఐఎస్ఐతో కనెక్షన్ ఉందని చెప్పడం దారుణం అని కామెంట్స్ తో హోరిత్తిస్తున్నారు.
రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న కాథువాకుల రెండు కాదల్’చిత్రంలో విజయ్‌సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తోంది.
