టాలీవుడ్ లో స్టార్ నటీనటులు ఎప్పుడో ఒకప్పుడు సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టక తప్పదు. ఇష్టమైన సినిమాల వల్ల కొందరు నిర్మాతలుగా మారుతుతుంటారు. మరికొందరు వారి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సొంత లాభాల కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు అక్కినేని కపుల్స్ కూడా సొంత ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారట. 

ఇటీవల రిలీజైన సమంత ఓ బేబీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలను .అందుకుంటోంది. అయితే నెక్స్ట్ సొంతంగా ఒక సినిమాను నిర్మించాలని సమంత డిసైడ్ అయ్యిందట. నాగ చైతన్య కూడా సమంత నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇక వీరు నిర్మించబోయే కొత్త సినిమాకు నందిని రెడ్డి దర్శకురాలని తెలుస్తోంది.

ఓ బేబీ సినిమాతో మెప్పించిన నందిని రెడ్డి ఇటీవల సమంతకు సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన ఒక కాన్సెప్ట్ ను వివరించిందట. అది నచ్చిన సమంత వెంటనే స్టోరీని డెవలప్ చేయమని చెప్పింది. ఎలాగైనా కొత్త ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించి సొంతంగా సినిమాను నిర్మించాలని సమంత భర్తతో కలిసి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.