నాగచైతన్యతో విడాకుల తరువాత కెరీర్ పై ఫోకస్ బాగా పెంచింది సమంత. వరుస సినిమాలో దూసుకుపోతున్న సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా ఒప్పుకుంటుంది. క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది.  

సినిమా వెంట సినిమా చేసుకుంటూ పోతోంది సమంత. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ ప్రాజెక్టులో నటించబోతోంది. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఫస్ట్ టైమ్ నటించనుంది. వీరిద్దరూ కలసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో రణవీర్ సింగ్ బ్లూ షర్ట్ తో ఉండగా, సమంత ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ తో కనిపిస్తోంది. ఈ ఫోటో పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి నెట్టింట్లో. 

ఈ సినిమాలో సమంత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కనపించనుందని సమాచారం. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో సమంత ఈ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో సమంత చేతిలో సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. సమ్ థింగ్ బ్యూటీఫుల్ ఈజ్ ఆన్ ద హొరైజన్ అని సమంత క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంటే ఈ సినిమా విశేషాలను అతి త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 

ఇక సమంత గురించి ఆమె స్టెప్పుల గురించి గతంలో రణ్ వీర్ సింగ్ గట్టిగానే పొగిడారు. సమంత డాన్స్ ఇరగదీసిన ఊ అంటావా మావ పాట తనకి ఎంతో ఇష్టమైనదని రణవీర్ సింగ్ చెప్పడం తెలిసిందే. పాటలో ఏముందో నాకు అర్థం తెలియదు. కానీ, మ్యూజిక్ మాత్రం నా హృదయాన్ని తాకింది అని రణవీర్ చెప్పాడు. 

సమంత పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా తమిళ్ లో కాతు వాకుల రెండు కాదల్ సినిమాలో కనిపించింది. విజయ్ దేవరకొండతో కలసి ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొని ఇటీవలే కశ్మీర్ నుంచి తిరిగొచ్చింది. శాకుంతలం, యశోద సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అటు హాలీవుడ్ మూవీ షూటింగ్ కు కూడా రెడీ అవుతోంది సమంత.

అంతే కాదు.. అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. దూసుకుపోతోంది సమంత. టైమ్ దొరికితే ఖాళీగా ఉండకుండా.. విహారయాత్రలకు వెళ్తుంది. ఆధ్యాత్మక క్షేత్రాలు పర్యటిస్తుంది.