ఫ్యామిలీ మాన్2లో లేడీ టెర్రరిస్ట్ గా సమంత రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగివుంటుందని ప్రచారం సాగుతుంది. ఇక సమంత డీ గ్లామర్ లుక్ లో చాలా రఫ్ గా కనిపిస్తుంది.
టాలీవుడ్ క్వీన్ సమంత డిజిటల్ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీమాన్ 2 త్వరలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ప్రసారం కానున్న విషయం తెలిసిందే. గతంలో సక్సెస్ అయిన ఫ్యామిలీమాన్ సిరీస్ కి ఇది కొనసాగింపుగా వస్తుంది. సెకండ్ సిరీస్ కోసం సమంతను ఓ ప్రధాన పాత్ర కోసం తీసుకోవడం జరిగింది.
మనోజ్ బాజ్పాయ్ హీరోగా తెరనెక్కిన ఈ సిరీస్ లో సమంత రోల్ కీలకం కానుంది. లేడీ టెర్రరిస్ట్ గా సమంత రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగివుంటుందని ప్రచారం సాగుతుంది. ఇక సమంత డీ గ్లామర్ లుక్ లో చాలా రఫ్ గా కనిపిస్తుంది. ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ స్ట్రీమింగ్ కి సమయం దగ్గరైన నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. రేపు ఫ్యామిలీమాన్ 2 ట్రైలర్ విడుదల కానుంది.
ట్రైలర్ ప్రకటన పోస్టర్ లో ముఖంపై గాయాలతో చాలా రఫ్ గా ఉన్నారు. ఫ్యామిలీ మాన్ 2 లోని సమంత లుక్ వైరల్ గా మారింది. తన మొట్టమొదటి వెబ్ సిరీస్ లో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న సమంత ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి. దర్శక ద్వయం రాజ్, డీకే ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు.
