Asianet News TeluguAsianet News Telugu

సమంత లేటెస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్.. హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తున్న స్టార్ బ్యూటీ, వైరల్ వీడియో

గత రెండేళ్లుగా సమంతకి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ కి గురైన సమంత తిరిగి తన సినిమాలతో బిజీగా మారింది. అంతలోనే ఆమెని మయో సైటిస్ అనే వ్యాధి చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.

Samantha latest looks is amazing video goes viral dtr
Author
First Published Jul 23, 2023, 10:17 PM IST

గత రెండేళ్లుగా సమంతకి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ కి గురైన సమంత తిరిగి తన సినిమాలతో బిజీగా మారింది. అంతలోనే ఆమెని మయో సైటిస్ అనే వ్యాధి చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. 

ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కూడా ఫినిష్ అయింది. అయితే సమంత ఒక ఏడాది సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం సమంత యోగ, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవడంతో సమంత ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సమంతకి మళ్ళీ ఏమైంది అంటూ కాస్త ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది. తాను ఎక్కడికి వెళ్లినా ఆ విశేషాలని ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా సమంత లేటెస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. ఈ మేరకు సామ్ ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సమంత బబ్లీగా ఉంటూ హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది అనే చెప్పాలి. 

అందంగా నవ్వుతూ స్కిన్ షో చేస్తూ సామ్ ఇస్తున్న ఫోజుకి యువత ఫిదా కావలసిందే. అంత క్రేజీగా సమంత వీడియో ఉంది. గంటల వ్యవధిలోనే ఈ వీడియోకి 12 లక్షల లైకులు దక్కాయి. అందం విషయంలో సమంత సమంతనే అని ఫ్యాన్స్ అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios