Actress Samantha : పుష్పలోని స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. అయితే అప్పటికే తాను జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నడుమ ఈ సాంగ్ చేయడం, అది ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందంది. ఇంత పెద్ద సక్సెస్ కు బన్నీ ప్రోత్సహించాడని తెలిపింది.
సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘పుష్ప’ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అల్లు అర్జున్ విభిన్న పాత్రాభినయం, రష్మిక మండన అల్లు అర్జు న్ కు దీటుగా నటించడంతో సినిమాలోని ఒక్కో సీన్ ఆడియోన్స్ తో అదుర్స్ అనిపించింది. ఇదంత ఒక ఎతైతే చిత్రంలోని స్పెషల్ సాంగ్ ‘ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా’తో సమంత కుర్రకారుకు చెమలు పట్టించింది. ఈ సాంగ్ తో సమంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సెన్సేషన్ కు కారణం అల్టు అర్జునేనంట.
దేవీ శ్రీ ప్రసాద్ అద్భతంగా ట్యూన్ అందించడంతో పాటు చంద్రబోస్ రచించిన లిరిక్స్ చక్కగా కుదిరాయి. దీంతో సాంగ్ వినసొంపుగా ఉండటంతో ఇట్టే ప్రేక్షకులకు నచ్చేసింది. దానికి తోడు సమంత స్పెషల్ అపియరెన్స్ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. సమంత, అల్లు అర్జున్ గ్రేస్ స్టెప్స్, బన్నీ స్టైలిష్ మూమెంట్స్ కు థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ తో రేచ్చిపోయారు.
సాంగ్ అప్లోడ్ చేసిన కొద్ది సమయంలోనే యూ ట్యూబ్ లోనూ రికార్డును సొంత చేసుకుంది. దీంతో సమంత వరల్డ్ వైడ్ పాపులారిటీని దక్కించుకుంది.
స్పెషల్ సాంగ్ చిత్రీకరణకు ముందు సమంత ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఈ సాంగ్ వైరలవడంతో కొంత తుడుచుకుపోయాయి. తానున్న పరిస్థతిలో ఈ పాట చేసేందుకు అవకాశం కల్పించినందుకు, సాంగ్ చేసేలా తనను ఒప్పించి, ప్రోత్సహించిన అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపింది.
అయితే ఈ మూవీలోని ఊ.. అంటావా స్పెషల్ సాంగ్ లో నటించడానికి మొదట్లో తను వెనకంజ వేసిందట. తన కెరీర్లోనే మొదటి ఐటెమ్ సాంగ్ అవడం, టాప్ హీరోయిన్ గా స్టార్డమ్ ఉండటంతో స్పెషల్ సాంగ్ లో ఒకే చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడిందట. అల్లు అర్జున్ ఒప్పించడంతోనే నర్తించానని అంటోంది సామ్. ఈ పాట తనకి బ్రహ్మాండమైన పేరు తెచ్చిపెడుతుందని తనకు అల్లు అర్జున్ హామీనిచ్చాడ. సాంగ్ ప్రత్యేకతను, తానే చేయాల్సిన అవసరాన్ని వివరించి స్పెషల్ సాంగ్ లో ఆడేలా చేశాడటంది సమంత.
