ప్రపంచంలోనే అత్యంత పాప్యులర్ సిరీస్లలో ది ఫ్యామిలీ మాన్ 2 నాలుగవ స్థానం అందుకుంది. హాలీవుడ్ కి చెందిన 'లోకి' ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.
హార్డ్ వర్క్... అదృష్టం ఇవి రెండూ కలిస్తే సమంత. రంగం ఏదైనా సమంత కాలు పెడితే సక్సెస్ కావలసిందే. స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సమంత డిజిటల్ ఎంట్రీ అదిరిపోయింది. సమంత డెబ్యూ వెబ్ సిరీస్ సంచలనాలు సృష్టిస్తుంది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తో సమంత అరుదైన రికార్డు అందుకుంది. ప్రముఖ సినిమా రేటింగ్ సంస్థ ఐ ఎమ్ డి బి ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ కి వరల్డ్ టాప్ ర్యాంకింగ్ కట్టబెట్టింది.
ప్రపంచంలోనే అత్యంత పాప్యులర్ సిరీస్లలో ది ఫ్యామిలీ మాన్ 2 నాలుగవ స్థానం అందుకుంది. హాలీవుడ్ కి చెందిన 'లోకి' ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఓ ఇండియన్ సిరీస్ హాలీవుడ్ సిరీస్ లకు పోటీ ఇస్తూ ఈ స్థాయి దక్కించుకోవడం అరుదైన విషయమే. సమంత యాక్టింగ్ ఆమె రోల్ సిరీస్ విజయానికి కీలకంగా మారింది.
తమిళ్ రెబల్ గా లేడీ టెర్రరిస్ట్ పాత్రలో సమంత అద్భుతం చేశారు. సమంత డీగ్లామర్ పాత్రలో ఎమోషన్స్ లేని అమ్మాయికి నటించి మెప్పించారు. మెయిన్ రోల్స్ చేసిన మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి పాత్రలు సిరీస్ ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.
వరల్డ్ సిరీస్ లో స్థానం దక్కించుకున్న నేపథ్యంలో ఫ్యామిలీ మాన్ 2 యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు రాజ్-డీకే మొదటి భాగానికి మించి ది ఫ్యామిలీ మాన్ 2 తెరకెక్కించారు. ఇక సిరీస్ పై మొదటి నుండి తమిళ ప్రజలు ఆగ్రహం ఉన్నారు. ఇది వాళ్ళ మనోభావాలను కించపరిచేదిగా ఉందని వ్యతిరేకిస్తున్నారు.