`సమంత.. చైతన్యకి విడాకులు ఇచ్చేయ్‌.. మనిద్దరం పెళ్ళి చేసుకుందాం..` సమంతని ఉద్దేశించి ఓ నెటిజన్‌ రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాని షేక్ చేస్తుంది. దీనికి సమంత స్పందించింది. అయితే ఏం సమాధానం చెప్పిందనేది ఉత్కంఠ నెలకొంది. మరి తన అభిమాని కోరికని నెరవేరుస్తుందా? దీనికి ఆమె రియాక్షన్‌ ఏంటనేది సస్పెన్స్ గా మారింది. అందరిని ఉత్కంఠకు గురి చేస్తుంది. 

అయితే ఎట్టకేలకు సమంత స్పందించింది. తనదైన స్టయిల్‌లో సమాధానమిచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ``అది కష్టమ్‌.. ఓ పని చెయ్‌.. చైతూని నువ్వే అడుగు` సమంత పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ కన్వర్‌జేషన్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. వైరల్‌గా మారింది. అయితే ఓ అభిమాని పోస్ట్‌కి స్టార్‌ హీరోయిన్‌ స్పందించడం, అది కూడా ఇలాంటి వివాదాస్పద పోస్ట్ కి స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఈ రోజు మధ్యాహ్నం టైమ్‌లో ఫీలింగ్‌ గుడ్‌ అంటూ చెట్టు కొమ్మని పట్టుకుని సరదాగా, సంతోషంగా వెలాడుతున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుంది ఈ ఫోటోకి కామెంట్లలో భాగంగా రోహిత్‌ యాదవ్‌ అనే అభిమాని పై విధంగా పోస్ట్ పెట్టాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

☀️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Nov 4, 2020 at 9:35pm PST