కవిత ఇన్స్పైరింగ్ స్టోరీ ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియోగా విడుదల చేశారు. ఆ వీడియో చూసిన సమంత కవితకు కార్ గిఫ్ట్ గా ఇచ్చారు.
ఓ లేడీ ఆటో డ్రైవర్ కి సమంత లక్షల విలువ చేసే కారును బహుమతిగా ఇచ్చి తన గొప్పమనసు చాటుకున్నారు. సమంత పంపిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ కి ఆ ఆటో డ్రైవర్ ఆనందం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ మారుతీ షో రూమ్ నుండి మీకు కారు బహుమతిగా వచ్చిందని, ఆటో డ్రైవర్ కవితకు ఫోన్ వచ్చింది. వాళ్ళు షో రూమ్ కి రావాలని కోరడంతో ఆమె, మారుతీ షో రూమ్ కి వెళ్లారు. గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా.. నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్ డిజైర్ కారును అందజేశారు.
ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో కవిత పాల్గొన్నారు. డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన కవితకు బాల్య వివాహం జరిగింది. భర్త రోజు తాగొచ్చి కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చింది. అక్కడ పొలం పనులకు వెళ్తూ ఏగుడురి చెల్లెళ్లను పోషించింది. తల్లి, దండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ మరింత కష్టమైంది. దీంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్‌కి వచ్చింది. మీయాపూర్ టూ బాచుపల్లి దారిలో ఆటో నడుపుతూ ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది.
కవిత ఇన్స్పైరింగ్ స్టోరీ ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియోగా విడుదల చేశారు. ఆ వీడియో చూసిన సమంత కవితకు కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. కారు ద్వారా కవిత మంచి సంపాదనతో, సంతోకర జీవితం గడపాలని సమంత ఆ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మంచి స్థాయిలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లేడీ ఎమ్పవర్మెంట్ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా, ఇలా పేద మహిళను ఆదుకోవడం చేస్తే మంచిది.
