అనంతపురం జిల్లాలో సోమవారం ఓ మొబైల్‌ షోరూం లాంఛ్‌ కోసం నటి సమంత విచ్చేసింది. సుభాష్‌ రోడ్డులో హ్యాపీ మొబైల్ షోరూంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెను చూడాలన్న ఆత్రుతతో దూసుకొచ్చాడు. అది గమనించిన పోలీసులు అతన్ని చితకబాదారు. ఆపై తోపులాటతో పోలీసులు స్వల్ఫ లాఠీ ఛార్జీ చేశారు. మితిమీరిన అభిమానం చేటన్న విషయం మరోసారి రుజువైంది. 

అనుకోని ఘటనతో దిగ్భ్రాంతికి లోనైన సమంత.. కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుని అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించారు.అనుకోని పరిణామంతో సమంత ఇబ్బంది పడినట్లు చెబుతున్నారు. కుర్రాడి ఉదంతంతో సీరియస్ అయిన పోలీసులు నిగ్రహం కోల్పోయి.. షోరూం దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో.. పలువురు గాయపడ్డారు. సమంత అనంతపురం జిల్లాకు రావుడేమో కానీ.. ఆమె అభిమానులకు మాత్రం లాఠీ దెబ్బలు బహుమానంగా తగిలాయని చెప్పక తప్పదు.