సమంత తమ సినిమాలో ఉందంటే సూపర్ హిట్ అన్న నమ్మకం..దర్శక,నిర్మాతల్లో పెరిగిపోయింది. ఆమె డేట్స్ కోసం వాళ్లంతా ఆమె చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు.  అయితే ఆమె అందరితో సినిమాలు ఎక్కడ చేయగలదు. దాంతో చివరకు తమ సినిమాలో గెస్ట్ గా గా అయినా కనిపించమంటున్నారు. అదే పద్దతిలో నాగార్జున కూడా తన కోడలు సమంత ని తన సినిమాలో గెస్ట్ గా అయినా కనిపించమని అడిగాడట. మామా మాట తీసేసేదేముంది.వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉండేలా చూడమని డైరక్టర్ కు నాగ్ చెప్పారట. ఇంతకీ మరి సమంత చేస్తున్న పాత్ర ఏమిటి

మీకు గుర్తుందా... మ‌న్మ‌థుడు సినిమాలో నాగార్జున ఆడవాళ్లకి ఎప్పుడూ దూరంగా ఉంటాడు. అలా  ఎందుకు ఉంటార‌నేది త‌నికెళ్ళ‌భ‌ర‌ణి చెబుతూ ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ‌తాడు. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2లో రివర్స్ సీన్ ఉంటుంది. అమ్మాయిల‌తో చాలా చ‌నువుగా ఉంటాడ‌ట నాగ్‌. ఆయ‌న ఎందుకు అంత చ‌నువుగా ఉంటాడ‌నేది స‌మంత పాత్ర వివ‌రిస్తుంద‌ని అంటున్నారు. సినిమాలో ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ చాలా కీలకం అని, ఆ ప్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లే ఈ పాత్ర సినిమాకి కీల‌కం కాబ‌ట్టి స‌మంత‌ని ఎంపిక చేసిన‌ట్టు సమాచారం. 

ఇక చిల‌సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా మ‌న్మ‌థుడు 2 చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్  హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగ‌ల్‌లో జ‌రుగుతుండ‌గా, సమంత ఇటీవ‌ల అక్క‌డికి వెళ్లి టీంతో జాయిన్ అయ్యింది.