సెలబ్రేటిస్ వివాహ వేడుకలంటే ఎదో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంటుంది. సినీ స్టార్స్ పాల్గొన్నారు అంటే గ్యాప్ లేకుండా కొన్ని రోజుల పాటు వారికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. అయితే రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ కూతురి ఆశ్రిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వేడుకలో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు.

కుటుంబ సభ్యుల సమక్షంలో ఆర్మ్ రెజ్లింగ్ విన్యాసాలను చూపించి అందరిని ఆశ్చర్యపరచింది. రానా - చైతు కూడా పక్కనే ఉన్నారు. చివరికి ఈ ఫైట్ లో ప్రత్యర్థి దగ్గుబాటి అమ్మాయిని ఓడించి సామ్ విజేతగా నిలిచింది.  అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.