Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ రోల్: సమంత..సూసైడ్ బాంబర్

ఆమె సూసైడ్ బాంబర్ గా కనిపించనుంది. ఆమె తమిళ అమ్మాయి రాజీ గా కనిపించనుంది. టెర్రరిజం యాంగిల్ కలిగిన ఈ పాత్ర  పూర్తి నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని చెప్తున్నారు.  ఈ సీజన్ లో ఆమె కీ రోల్ లో కనిపించనుంది. ఈ షో ట్రైలర్ ఈ రోజే రిలీజ్ కానుంది.  వెబ్ సీరీస్ రిలీజ్ కూడా జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో ఉండొచ్చు.

Samantha appears as a suicide bomber! JSP
Author
Hyderabad, First Published May 19, 2021, 9:02 AM IST

 సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సెకండ్ సీజన్  త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఆమె చేసిన పాత్ర ఏమిటనేదానిపై రకరకాల రూమర్స్ వినపడ్డాయి.  పాకిస్థానీ అమ్మాయిగా సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారని కొందరన్నారు. అలాగే ఆమె ఆమె బోల్డ్ గా బిహేవ్ చేస్తూ  హనీట్రాప్ చేసే క్యారక్టర్ అని అన్నారు. అయితే అవేమీ నిజం కాదని తెలిసింది. ఆమె సూసైడ్ బాంబర్ గా కనిపించనుంది. ఆమె తమిళ అమ్మాయి రాజీ గా కనిపించనుంది. టెర్రరిజం యాంగిల్ కలిగిన ఈ పాత్ర  పూర్తి నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని చెప్తున్నారు.  ఈ సీజన్ లో ఆమె కీ రోల్ లో కనిపించనుంది. ఈ షో ట్రైలర్ ఈ రోజే రిలీజ్ కానుంది.  వెబ్ సీరీస్ రిలీజ్ కూడా జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో ఉండొచ్చు.

ఈ సీరిస్ ని డైరక్ట్ చేస్తున్న డీకే అండ్ రాజ్ మాట్లాడుతూ...సమంత చేసే పాత్ర ఆమె కెరీర్ లోనే బోల్డెస్ట్ రోల్ . అది ఆమె కు ఓ గేమ్ ఛేంజర్ గా మారుతుంది అంటున్నారు. డిసెంబరులో ఈ రెండో సీజన్‌ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ ఆఫీసు చుట్టూ సాగిన ఫస్ట్ పార్ట్ లో మనోజ్‌ నేషనల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ ఏజెంట్‌గా కనిపించారు.  

 ఈ సిరీస్‌పై దేశ వ్యాప్తంగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇండ‌ర్వ్యూల్లో త‌న పాత్ర షాకింగ్‌గా వుంటుంద‌ని, చాలా బారియ‌ర్స్‌ని ఈ సిరీస్‌తో క్రాస్ చేశాన‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.  తొలిసారి ఈ సిరీస్‌తో  వెబ్ ప్ర‌పంచంలోకి ఎంత‌ర‌వుతున్న స‌మంత షాకింగ్ పాత్ర‌లో స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది.

‘ఫ్యామిలీ మెన్‌ 2’  లో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్‌ నటుడు షరీబ్‌ హష్మీ మీడియాతో మాట్లాడుతూ.. సమంతపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘సమంత పాత్ర జబర్దస్త్‌గా ఉంటుంది. ఆమె లుక్‌ చూస్తే పడిపోతారు. ఆమె అద్భుతమైన సహ నటి, గొప్ప వ్యక్తి.  ఈ సిరీస్‌లో సర్‌ప్రైజింగ్‌ రోల్‌ పోషించారు. సమంత గతంలో చేసిన పాత్రలతో పోల్చితే ఇది పూర్తి విభిన్నంగా ఉంటుంది, ఏ మాత్రం సంబంధం ఉండదు’ అని ఆయన అన్నారు. 
  

Follow Us:
Download App:
  • android
  • ios