ఈ సంవత్సరం  సెకండ్ హాఫ్   సమంత ఓ బేబీ తో హిట్ తో మొదలైంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే టాక్ అఫ్ ది టాలీవుడ్ అయినా ఓ బేబీ విడుదల తర్వాత కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

ఓ బేబీ ఫస్ట్ హాఫ్ కామెడీగా ఎంటర్టైన్ చెయ్యగా.. సెకండ్ హాఫ్ లో  ఎమోషన్స్ తో ..  ఓ బేబీ సూపర్ హిట్ అయ్యింది. ఇక సమంత మ్యానియా, ఆమె క్రేజ్ అన్ని ఓ బేబీ కి అదనపు హంగులు కావడం కూడా ఆ సినిమాకి కలిసొచ్చాయి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు మంచి వసూళ్లు సాధించింది. వీకెండ్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. 

ఇక  ఈ సినిమా విజయంలో  సమంత పాత్ర మాత్రం చెప్పుకోదగనిది. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన సినిమాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది.  మీడియాలో ఆమె ఇంటర్వూలు ఇచ్చింది. అక్కడితో ఆగకుండా నిన్నటికి నిన్న హైదరాబాద్ లో థియేటర్ల విజిట్ చేసింది సమంత.

అక్కడితో ఆమె ఆగేటట్లు కనపడటం లేదు.  ఆంధ్రలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, లాంటి ప్రాంతాలకు  వెళ్లి థియేటర్లులో అభిమానులను పలకరించాలనే  ఆలోచనలో ఉంది సమంత. గతంలోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి కానీ  ఈ రేంజ్ హీరోయిన్ కష్ట పడటం మటుకు ఎప్పుడూ జరగలేదు.  సమంత వస్తే థియేటర్ల వద్ద జనాల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే అని ముందు ఏర్పాట్లను సురేష్ ప్రొడక్షన్స్ చేస్తోందిట.