కరోనా కారణంగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోవటంతో సినీ తారలు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే సినీ తారలకు ఖాళీ సమయం దొరకటంతో ప్రస్తుతం ఈ హాలీడేస్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు స్టార్స్‌. ఈ నేపథ్యంతో తాజాగా సమంత కూడా కొత్త బాధ్యతలను తీసుకుంది.

ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన సమంత తాజాగా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ మొదలు పెట్టింది. తన ఇంట్లోని వెజిటబుల్ గార్డెన్‌ను అభిమానులకు పరిచయం చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది సమంత. మన తినే కూరగాయలను మనమే ఆర్గానిక్‌ పద్ధతుల్లో పండించుకుంటే మంచిది అనే  సందేశాన్ని అభిమానులకు ఇస్తోంది సామ్‌. లాక్‌ డౌన్‌ కాలమంతా సమంత, నాగచైతన్యలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు స్వయంగా బయటకు వెళ్లి తమకు కావాల్సిన నిత్యవసరాలను తెచ్చుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే పెళ్లి తరువాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ కథ మీద దృష్టి పెట్టిన సమంత ఓ బేబీ, మజిలీ లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా డిజిటల్‌ రంగంలోకి అడుగు పెట్టింది. ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లో స్పెషల్ రోల్‌లో నటించింది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్‌ స్టోరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.