Asianet News TeluguAsianet News Telugu

అవన్నీ పుకార్లే  అంటున్న సమంత!

సమంత తనపై వస్తున్న కొన్ని పుకార్లపై స్పందించడం జరిగింది. సోషల్ మీడియాలో తన పేరు ప్రక్కన అక్కినేని తొలగించడంతో పాటు 'ఎస్' అనే లెటర్ ఉపయోగిస్తున్న సమంత తీరుపై అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. 

samantha akkineni condemns all rumours here are details
Author
Hyderabad, First Published Aug 26, 2021, 9:06 AM IST

చాలా కాలం తరువాత బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో సమంత పాల్గొన్నారు. త్వరలో సమంత నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 తెలుగు, తమిళ వర్షన్స్ కూడా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొమోషన్స్ కోసం ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత పలు ఆసక్తిక విషయాలు వెల్లడించారు. 


ది ఫ్యామిలీ మాన్ 2లో తన పాత్ర పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యిందని, అయితే సిరీస్ విడుదలయ్యాక కొందరు అభిప్రాయం మార్చుకున్నారని సమంత తెలిపారు. ఇక ఏదీ కావాలని చేయలేదని, ఒకవేళ తన పాత్ర ఎవరినైనా ఇబ్బంది పెట్టివుంటే వాళ్లకు నా క్షమాపణలు అని సమంత బహిరంగంగా తెలియజేశారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత తమిళ ఈలంకి చెందిన రెబల్ రోల్ చేశారు. నిజానికి అది విలన్ పాత్ర కాదని, నమ్మిన సిద్దాంతం కోసం పోరాడే రాజీ అనే అమ్మాయి గాథ అన్నారు. 


ఇక సమంత తనపై వస్తున్న కొన్ని పుకార్లపై స్పందించడం జరిగింది. సోషల్ మీడియాలో తన పేరు ప్రక్కన అక్కినేని తొలగించడంతో పాటు 'ఎస్' అనే లెటర్ ఉపయోగిస్తున్న సమంత తీరుపై అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు. అవన్నీ పుకార్లే అంటూ సమంత క్లారిటీ ఇచ్చారు. కొత్త సినిమాలకు అప్పుడే సైన్ చేయనని, కొంత విరామం తీసుకున్నాక కథలు వింటానని సమంత స్పష్టం చేశారు. మరోవైపు సమంత నటించిన మైథలాజికల్ చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios