టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు (Samantha) బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ విసిరిన వర్క్ అవుట్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఈ మేరకు జిమ్ లో ఫ్యాట్ ను కరిగించేందుకు హెవీ వర్క్ అవుట్స్ చేస్తోంది.
గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ సమంత ఫిట్ నెస్ పట్ల ఎంతటి శ్రద్ధ తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. ప్రతి రోజూ ఎక్సర్ సైజ్ లు చేస్తూ ఫిట్ గా కనిపిస్తుంది. జీరో ఫ్యాట్ బాడీని మెయిన్ టేయిన్ చేస్తూ పదహారేళ్ల కుర్ర భామాల తయారవుతోంది. అయతే తన ఫిట్ నెస్ వర్క్ అవుట్ వీడియోలను గతంలోనూ చాలా సార్లే అభిమానులతో పంచుకుంది. కానీ ఈసారి కిల్లర్ వర్క్ అవుట్స్ తో మతిపోగొడుతోంది. సమంత. దీనికి కారణం బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) అని చెబుతోంది. ఇంతకీ ఏమైందంటే..
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తాజాగా నటించిన హిందీ చిత్రం ‘ఎటాక్’ (Attack). ఈ చిత్రంలో జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి ఓ కీలక పాత్రలో నటించింది. అయితే ఎటాక్ మూవీ ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ ప్రీత్ హెవీ వర్కట్ అవుట్ చేస్తూ ‘ఎటాక్ ఛాలెంజ్’ను ప్రారంభించింది. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ (Jacqueline Fernandez)కు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్ ను కొనసాగించాలని కూడా సూచించింది.
దీంతో టైగర్ ఫ్రాష్ తన జిమ్ లో హెవీ వెయిట్ డబుల్స్ తో వర్కౌట్ చేసి.. రకుల్ ఛాలెంజ్ ను స్వీకరించాడు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. తనను ఛాలెంజ్ చేసినందుకు రకుల్ కు థ్యాంక్స్ చెప్పాడు. ఎటాక్ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ తర్వాత ఛాలెంజ్ ను కొనసాగించేందుకు సమంత, రకుల్ ప్రీత్ ప్రియుడు జాకీ భగ్నానీకి వర్కౌట్ ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన సమంత బ్లాక్ స్పోర్ట్స్ వేర్ లో హెవీ వర్కౌట్ చేసింది.
తన ఛాలెంజ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ తర్వాత ఛాలెంజ్ న కొనసాగించడానికి అర్జున్ కపూర్‌ని నామినేట్ చేసింది. తనను ఛాలెంజ్ చేసినందుకు టైగర్ ష్రాఫ్ కు ధన్యవాదాలు తెలిపింది. అయితే ఈ వర్కౌట్ వీడియోను చూసిన రకుల్ ప్రీత్ సంతోషిస్తూ.. ఫైర్ ఎమోజీని కామెంట్ సెషన్ లో వదిలింది. ప్రస్తుతం సమంత హరి మరియు హరీష్ దర్శకత్వం వహించిన తన రాబోయే పాన్-ఇండియన్ చిత్రం యశోద షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
