ఓటీటీలో కూడా అదే ఊపు.. కడుపుబ్బా నవ్విస్తున్న సామజవరగమన
థియేటర్ లో ఆడియన్స్ చేత కడుపుబ్బా నవ్వించిన సామజవరగమన సినిమా .. ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ చేత కితకితలు పెట్టిస్తోంది. రీసెంట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కిన ఈమూవీ.. మంచిరెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు, యంగ్ హీరోయిన్ రెబా మోనికా జంటగా నటించిన సినిమా సామజవరగమన. యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచిన సామజవరగమన సినిమా థియేటర్స్ లో ఎలా అయితే మంచి రెస్పాన్స్ సాధించిందో.. తాజగా ఓటీటీలో కూడా అంతే రెస్పాన్స్ సాధిస్తోంది. రీసెంట్ గానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది సామజవరగమన.
మొట్టమొదటి తెలుగు ఓటీటీ యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాదు కేవలం 40 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసి ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలిపారు. ఇక గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను హాస్య మూవీస్ పతాకంపై నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అయ్యింది.
కమర్షియల్ సినిమాల వైపు కాకుండా..కాస్త డిఫరెంట్ గా వెళ్తున్నాడు శ్రీవిష్ణు. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగాసినిమాలు చేస్తూ.. అటుయూత్ కూడా అట్రాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. శ్రీవిష్ణుకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫ్యాన్స్ ఎక్కువ. అందుకే బుల్లితెరపై కూడా ఈసినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. రేపో మాపో టెలివిజన్ లో ప్రసారం చేసినా.. ఈసినిమా భారీ టీఆర్పీని సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. కాస్త స్లోగా అయినా.. టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ మార్క్ సాధించాడు శ్రీవిష్ణు.