కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేడు తన 55వ జన్మదినం జరుపుకుంటున్నారు. డిసెంబర్ 27 సల్మాన్ జన్మదినం కాగా ఘనంగా నిర్వహించాలని ఫ్యాన్స్ భావించారు. అలాగే ప్రతి ఏడాది సల్మాన్ పుట్టినరోజునాడు వేల మంది అభిమానుల ఆయన ఇంటి ముందుకు చేరుకొని బర్త్ డే విషెష్ తెలియజేస్తారు. ఇంటిపై నుండి సల్మాన్ చేసే అభివాదం కోసం ఎదురుచూస్తారు. ఈసారి ఈ పద్దతికి స్వస్థి చెప్పాలని సల్మాన్ అభిమానులను వేడుకున్నాడు. 
నిన్న సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా సందేశం ద్వారా ఈ విషయం తెలియజేశారు. 

ఏళ్ళుగా తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కోసం నా ఇంటి ముందు మీరు గుంపుగా చేరవద్దు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మీరు సోషల్ డిస్టెన్స్ పాటించండి. మాస్క్ ధరించండి అలాగే శానిటైజర్స్ వాడండి అని సల్మాన్ ఫ్యాన్స్ కి పిలుపునిచ్చారు. ఆయనను అమితంగా ప్రేమించే అభిమానులను ఇది కొంచెం నిరాశపరించే అంశమే అని చెప్పాలి. 


సల్మాన్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 14 హోస్ట్ గా ఉన్నారు. ఆయన హోస్ట్ గా సీజన్ 14 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక ఆయన రెండు చిత్రాలు ప్రకటించారు. ప్రభుదేవా దర్శకత్వంలో రాధే మూవీలో సల్మాన్ నటిస్తున్నారు. అలాగే కబీ ఈద్ కబీ దివాళి ఆమె మరో చిత్రంలో సల్మాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.