ఆదివారం జరిగిన ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంపై చాలా మంది సినీ ప్రముఖులు స్పందిస్తూ  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇండియా గెలుపుపై తనదైన శైలిలో స్పందించాడు. 

టీమిండియా జెర్సీతో సోఫాపై కూర్చొని మ్యాచ్ వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా  ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. భారత్ టీమ్ నుంచి భారత్ కి శుభాకాంక్షలు అని సల్మాన్ ట్వీట్ చేశాడు. ఇటీవల ఈద్ కానుకగా సల్మాన్ భారత్ సినిమాను రిలీజ్ చేసి ఎప్పటిలానే బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. 

ఇప్పటికే 200కోట్లకు పైగా లాభాలను అందించిన భారత్ సరికొత్త రికార్డులను బద్దలు కొట్టే విధంగా కలెక్షన్స్ ను అందుకుంటోంది. సల్మాన్ కెరీర్ఫ్ లో అత్యధిక వేగంగా 100కోట్లను అందుకున్న 16 చిత్రాల్లో ఇది కూడా నిలిచింది.