మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లింది

వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి మలయాళ లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్. రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ లో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న తెలుగు వ్యక్తి మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇప్పటికే గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా.. పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్ర కోసం చాలా కాలం ఆలోచించారు. ఇక పైనల్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుంది అనుకున్నారు. మెగాస్టార్ తో ఉన్న అనుబంధం కారణంగా ఈసినిమాలో నటించడానికి సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నారు అని తెలిసినప్పటి నుంచీ ఫ్యాన్స్ ఈ ఇద్దరి షూటింగ్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలని ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. కరోనా వల్ల డిలే అవుతూ వచ్చిన గాడ్ ఫాదర్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఇక ఇందులో సల్మాన్ ఖాన్ పార్ట్ షూటింగ్ ను ఈరోజు(12 మార్చ్) నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. 

అయితే ఈ మూవీ షూటింగ్ ముంబయ్ లో జరగబోతోంది. మెగాస్టార్ తో పాటు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సీన్స్ ను ముంబయ్ లో షూట్ చేయబోతున్నారు. ముంబై సమీపంలోని ఎన్డీ స్టూడియోస్ లో షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నిర్విరామంగా వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగబోతోంది. అంతే కాదు సల్మాన్ ఖాన్ కు అత్యంత ఆప్తుడు మెగాస్టార్ చిరంజీవి ముంబయ్ షూటింగ్ కు వస్తుండటంతో సల్మాన్ స్వయంగా ఆయన ఫామ్ హౌస్ లో చిరంజీవికి ఆతిద్యం ఇస్తున్నారు. 

షూటింట్ జరిగిన ఈ వారం రోజులు చిరు సల్మాన్ ఫామ్ హౌస్ లోనే ఉండనున్నారు. అత్యంత విలాసవంతమైన ఈ ఫామ్ హౌస్ లో సల్మాన్ కి అత్యంత ఆత్మీయులు మాత్రమే విడిది ఇస్తారు. ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ ఈ షెడ్యూల్ తో దాదాపు పూర్తి అయినట్టే అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మెగాస్టార్ బోళా శంకర్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నారు.