Asianet News TeluguAsianet News Telugu

‘రాధే‌’: రివ్యూ రైటర్ కు సల్మాన్ లీగల్ నోటిస్

గతేడాది నుంచి థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘రాధే’ మూవీని సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్రంగా ఉండటంతో ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం జీప్లెక్స్‌లో పే పర్‌ వ్యూ విధానంలో విడుదల అయ్యింది.

Salman Khan Sues Critic for His Radhe Review jsp
Author
Hyderabad, First Published May 26, 2021, 5:40 PM IST

కరోనా సెకండ్ వేవ్‌ టైమ్‌లో రిలీజ్‌ అయిన భారీ కమర్షియల్ చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌వాంటెడ్‌ భాయ్‌’. సల్మాన్‌ ఖాన్ లాంటి టాప్‌ హీరో నటించిన ఈ సినిమా హైబ్రిడ్‌ రిలీజ్ అనే కొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. అంటే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఒకేసారి రాధేను రిలీజ్ చేశారు. మే 13న జీ ఫ్లిక్స్‌లో , డిష్‌, డీ2హెచ్‌, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ లాంటి డీటీహెచ్‌ వేదికల్లో ‘పే పర్‌ వ్యూ’ విధానంలో రిలీజ్‌ చేశారు. 

వ్యూయర్‌షిప్‌తో దుమ్మురేపినప్పటికీ.. కంటెంట్‌ ఆడియెన్స్‌ను మెప్పించకపోవడం, నెగెటివ్‌ రివ్యూలు, ట్రోలింగ్‌తో.. 1.8 ఐఎండీబీ రేటింగ్‌తో సల్మాన్‌ కెరీర్‌లోనే వరెస్ట్‌ మూవీ ట్యాగ్‌ దక్కించుకుంది రాధే. ఇక ఈ చిత్రాన్ని రివ్యూలన్నీ ఏకి పారేసాయి. అయితే అందరికన్నా ఎక్కువగా ఈ సినిమాని తిట్టిన బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఖాన్. 

దాంతో సల్మాన్ ఖాన్ కు ఈ విమర్శకుడిపై మండిపోయింది. దాంతో ఈ రివ్యూ రైటర్ పై ముంబై కోర్టుకు వెళ్లారు. అలాగే లీగల్ నోటీస్ పంపించారు. అతని రివ్యూ వల్ల కలెక్షన్స్  దెబ్బ తిన్నాయని, పరువు నష్టపోయిందని ఆ పిటీషన్ లో పేర్కోన్నారు. సల్మాన్ కు చెందిన లీగల్ టీమ్ లీగల్ నోటీస్ పంపి సమాధానం చెప్పమన్నారు. ఈ విషయాన్ని కమాల్ ఖాన్ స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఇక నుంచి సల్మాన్ సినిమాలకు రివ్యూల ఇవ్వనని అన్నారు. అయినా తను నిజం కోసం ఎప్పుడూ పోరాడతానని, తన రివ్యూలు ఆపే ప్రయత్నం చేయటం కన్నా సల్మాన్ మంచి సినిమాలు చేస్తే బాగుంటుందని సూచించాడు. 
 
ఇక  సినిమాకు నెగెటివ్ టాకే వచ్చినా…  జోరు మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఈ సినిమా మరో రేర్‌ ఫీట్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే థియేటర్లతో పాటు జీ5, జీప్లెక్స్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లో రిలీజ్ అయ్యింది రాధే. నెక్ట్స్ యాపిల్ టీవీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు. యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతున్న తొలి బాలీవుడ్ మూవీ కూడా రాధేనే. ఈ ప్లాట్‌ ఫామ్‌లో 65 దేశాల్లో అందుబాటులోకి రానుంది సల్మాన్ మూవీ.

దిశాపటానీ హీరోయిన్‌గా నటించిన రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటించారు సల్మాన్‌. డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. మాస్ యాక్షన్‌తో సల్మాన్ ఫ్యాన్స్ సాటిస్‌ఫై అయినా… జనరల్ ఆడియన్స్‌ మాత్రం ఈ మాస్ మసాలా మూవీకి అస్సలు కనెక్ట్ కాలేదు. దీంతో ఈద్‌కి బ్లాక్ బస్టర్ కొడతారనుకున్న బాయ్‌జాన్‌.. అభిమానులతో పాటు ఇండస్ట్రీని కూడా నిరాశపరిచారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios