ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతుంటాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తాజాగా మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్ చేసిన పనికి నెటిజన్లు గట్టిగా ఫైర్ అవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అటు సినిమాలు.. ఇటు బుల్లితెర ప్రోగ్రామ్స్ తో తెగ హడావిడి చేసేస్తున్నాడు. ఆయన ఎంత బిజీగా ఉంటున్నాడో.. అంతకురెట్టింపు వివాదాలు కూడా పోగేసుకుంటున్నాడు. ఇప్పటికే సల్మాన్ చేసిన పనికి.. ఉగ్రవాదుల ముప్పుతో ఇబ్బందిపడుతున్నాడు. సల్మాన్ ను ఎలాగైనా చంపేస్తాం అని లారెన్స్ బిష్గోయ్ గ్యాంగ్ పంతం పూని తిరుగుతున్నారు. దాంతో సల్మాన్ ప్రస్తుతం వై క్యాటగిరీ భద్రత నడుమ తిరుగుతున్నాడు. తనకు తాను ప్రైవేట్ గా ఇంకాస్త సెక్యూరిటీని కూడా ఆడ్ చేసుకున్నాడు. ఇలా తాను చేసిన పనులకు ఇబ్బందిపడుతూనే.. మరో పక్క మరికొన్ని వివాదాలు కోరి తెచ్చుకుంటున్నాడు.
ఇక సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకు పర్మినెంట్ హోస్ట్ అన్న సంగతి తెలిసిందే.. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ మొదలైంది. ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి నెటిజెన్స్ నుంచి ఏదో విషయంలో తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది. జైద్ హదీద్ తన తోటి కంటెస్టెంట్ ఆకాంక్ష పూరితో అసభ్యకరంగా ప్రవర్తించడం వివాదం అయితే, ఆ తరువాత వారిద్దరి లిప్ కిస్ చేసుకోవడం ప్రేక్షకులను ఆగ్రహానికి గురి చేసింది.
ఇక అది అయిపోయింది అనుకున్న టైమ్ కు.. తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన ఒక పని నెటిజన్లకు మరింత కోపం తెప్పించింది. ఈ శనివారం (జులై 8) కంటెస్టెంట్స్ ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్.. హౌస్ లో ఉన్నవారి తప్పొప్పులను చూపించి కౌంటర్స్ ఇచ్చాడు. అయితే ఇదే సమయంలో సల్మాన్ చేతిలో సిగరెట్‌తో కనిపించాడు. మర్చిపోయి అలా వచ్చేశాడా.. లేకు కావాలని ఇలాచేశాడా తెలియదు కాని.. రియాల్టీ షోలో ఆయన సిగరెట్ తో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక ఆ ఫోటో చూసిన నెటిజెన్స్.. ఫైర్ అవుతున్నారు. అంతే కాదు కౌంటర్లు కూడా ఇస్తున్నారు. “కంటెస్టెంట్స్ తప్పొప్పులు చూపే ముందు, మీరు మారండి” అంటూ సల్మాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. “ఒక సెలబ్రిటీ స్టేజిలో ఉన్న వ్యక్తే ఇలా పబ్లిక్ గా సిగరెట్ కాల్చి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు” అంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. మరి దీని పై సల్మాన్ మరియు షో నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
