Asianet News TeluguAsianet News Telugu

హత్య బెదిరింపులు, సెక్యూరిటీపై.. మొదటి సారి స్పందించిన సల్మాన్ ఖాన్

తనకు వస్తున్న బెదిరింపులు.. ప్రాణ హాని గురించి మొదటి సారి స్పందించాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తన అనుభవాన్ని వెల్లడించారు స్టార్ హీరో. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 
 

Salman Khan React On Getting Death Threats JMS
Author
First Published Apr 30, 2023, 11:17 AM IST

గ్యాంగ్‌స్టర్ల టార్గెట్ లిస్ట్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు తన అనుభవాన్ని పంచుకున్నారు. అంతే కాదు ఈ ప్రాణహాణి నుంచి తనను తాను ఎలా కాపాడుకుంటున్నారు.. ఈవిషమ పరిస్థితులను  ఎలా ఎదుర్కొంటాడో పంచుకున్నాడు.ఇక ఇప్పటికే వరుస బెదిరింపు కాల్స్ తో పాటు..సల్మాన్ ను చంపేస్తామని.. పబ్లిగ్ గానే లారెన్స్ బిష్నోయ్ ప్రకటించడంతో.. సల్మన్ ఖాన్ కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు Y+ కేటగిరీ భద్రతను కల్పించారు.

తాజాగా ఇండియాన్ ఫేమస్  టీవీ షో 'ఆప్ కి అదాలత్'లో సల్మాన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన తన  అనుభవాన్ని ఇక్కడ  పంచుకున్నాడు,  ఆయన మాట్లాడుతూ.. నాకుబద్రత ఉంది.. అవును.. అభద్రత కంటే భద్రత ఉంది. ప్రస్తుతం  రోడ్డుపై సైకిల్ తొక్కడం మరియు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లడం నాకు  సాధ్యం కాదు. గతంలో కొంతైనా బయటకు వెళ్ళే స్వేచ్చ ఉండేది. అది ఇప్పుడు లేదు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నన్ను కాపాడటానికి సెక్యూరిటీ ఉంటుది. కాని దాని వల్ల నన్ను ప్రేమించే పేద అభిమానులు నా దగ్గరకు రాకుండా చేస్తుంది.. అందుకే నాకు బద్రత ఉంది అంటున్నారు సల్మాన్ ఖాన్. 

ఈ బద్రత వల్ల కూడా తాను అసౌకర్యానికి గురి అవుతున్నట్టు ఆయన వెల్లడించారు. నేను ఏది చెబితే అదే చేస్తున్నాను. నన్ను చంపాలి అనుకునే వాళ్ళకు 100 సార్లు అదృష్టం ఉండాలి, నేను ఒకసారి అదృష్టం పొందాలి'. కాబట్టి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు సల్మాన్ ఖాన్.   నేను ప్రతిచోటా మంచి సెక్యూరిటీతో ఉంటున్నాను. కాని మీరు ఏమి చేసినా జరగబోయేది మాత్రం జరుగుతుందని నాకు తెలుసు. పైన దేవుడు ఉన్నారు. స్వేచ్చగా తిరగడం ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు.. నా చుట్టు తుపాకుల తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇబ్బంది పడొచ్చు.. కాని నేను స్వేచ్చగా తిరిగే రోజులు ముందు ఉన్నాయి అని ఆశాభావం వ్యాక్తం చేశారు సల్మాన్. 

కొంత కాలం క్రితం సల్మాన్ ను హత్య  చేస్తామంటూ.. బెదిరింపు నేపథ్యంలో, ముంబై పోలీసులు ఒక మైనర్‌ను అరెస్టు చేశారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఏప్రిల్ 10న  మరో బెదిరింపు కాల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన రాకీ భాయ్‌గా గుర్తించారు. అతను గో సంరక్షక్ గా నిర్ధారించారు. ఇక   సల్మాన్ ఖాన్‌ను హత్య చేస్తాను అని  ఫోన్ చేసి  ఓ వ్యక్తి బెదిరించాడు.కాల్ చేసిన వ్యక్తి మైనర్ అని తేలిందని ముంబై పోలీసులు తెలిపారు. "ప్రస్తుతానికి, కాల్‌ను సీరియస్‌గా తీసుకోకూడదని మేము భావిస్తున్నాము. అయితే మైనర్ ఎందుకు అలా ప్రవర్తించాడో మేము పరిశీలిస్తున్నాము అని ఒక అధికారి తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios