కిసీ కా భాయ్..కి సీ కి జాన్ సినిమాతో  రిలీజ్ కు రెడీగా ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తాజాగాట్రైలర్ తో ఈసినిమాపై అంచనాలు పెంచేశాడు స్టార్ హీరో. 

సల్మాన్ ఖాన్ నుంచి రాబోతున్న తాజా సినిమా 'కిసీ కా భాయ్ కి సీ కి జాన్. సల్మాన్ అభిమానులను పలకరించడానికి రెడీ అవుతోందీ మూవీ.సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో నిర్మించిన ఈసినిమా భారీబడ్జెట్ సినిమాగా తెరకెక్కింది. అందుకు తగినట్టు గానే భారీ తారాగణంకూడా నటించారీ సినిమాలో. ఇక ఈసినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. 

ఇక ఈమూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సినిమా. దాంతో ప్రమోషన్స్ విషయంలో దూసుకుపోతున్నారు మేకర్స్. ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా వరుస అప్ డేట్స్ ఇస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. 

YouTube video player

నవరసాలు కనిపించేలా.. లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ మిళితంగా కిసికా భాయ్..కిసీకి జాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మూవీ టీమ్.. ఈ ట్రైలర్ ను కట్ చేసి రిలీజ్ చేశారు. అంతే కాదు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా సౌత్ స్టార్స్ మారబోతున్నారు. సల్మాన్ మువీలో ఇంత మంది సౌత్ స్టార్స్ నటించడం ఇదే మొదటి సారి... 

ఈసినిమాలో ఇంపార్టెంట్ పాత్రలో సల్మాన్ ఖాన్ తో పాటు విక్టరీ స్టార్ వెంకటేష్ నటించారు. అంతే కాదు ఓ సాంగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ పెర్ఫామెన్స్ ఇవ్వగా.. ఇందులో మెయిన్ విలన్ గా అద్భుతమైన పాత్రలో జగపతిబాబు సందడి చేయబోతున్నారు. ఈ పాత్రలన్నిటినీ.. హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ ను రూపొందించారు మేకర్స్. విలన్ గా జగపతిబాబు విజృంభించినట్టుగా ఈ ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోంది. 

ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో.. కుదైలై ఉన్న బాలీవుడ్ ను పఠాన్ సినిమా కాపాడింది. ఆతరువాత కూడా వరుసగా ప్లాప్ లు తప్పడంలేదు బాలీవుడ్ కు. ఈక్రమంలో తన ప్రాణ స్నేహితుడు షారుఖ్ ఖాన్ సినిమా లా.. తన సినిమా కూడా బాలీవుడ్ కు మెమరబుల్ హిట్ ఇస్తుంది అనినమ్ముతున్నాడు సల్మాన్. పైగా.. ఈసినిమాలో షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేశారు. పఠాన్ లో కూడా సల్మాన్ గెస్ట్ రోల్ లో మెరిసారు. దాంతో కిసికా బాయ్ .. కిసీకి జాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.