టాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ పరిచయం అయ్యారు. ఒకానొక దశలో క్రేజ్ తగ్గిన హీరోయిన్స్ కి కూడా అవకాశాలు ఇచ్చి కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చాడు. ఇక పదేళ్ల క్రితం తన ఫ్రెండ్ కి ఇచ్చిన మాటకు కట్టుబడి సల్మాన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. 

సీనియర్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ తో సల్మాన్ కెరీర్ మొదటినుంచి క్లోజ్ గా ఉంటున్నాడు. అయితే మంజ్రేకర్ కూతురిని చిన్నపుడు చూసిన సల్మాన్ మొదటి చూపులోనే ఆమెను హీరోయిన్ గా పరిచయం చేస్తానని మాట ఇచ్చేశాడట. పదేళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం సల్మాన్ దర్శకుడు సెట్ చేసిన మరో హీరోయిన్ ని పక్కనపెట్టేశాడట. 

ఆమెకు తరువాత అవకాశం ఇద్దామని ముందు  మంజ్రేకర్ కుమార్తె సయిని హీరోయిన్ గా పరిచయం చేయాలనీ డిసైడ్ అయ్యాడట. దీంతో ఆమె నెక్స్ట్ దబాంగ్ 3లో సల్మాన్ తో రొమాన్స్ చేయనుందని బాలీవుడ్ లో గ్యాప్ లేకుండా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ బ్యూటీ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.