బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న భరత్ సినిమాపై ప్రస్తుతం దేశమంతటా అంచనాలు పెరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ తోనే బజ్ క్రియేట్ చేసిన బాయ్ ఇప్పుడు మరో డిఫరెంట్ లుక్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. దేశభక్తి అమితంగా పెంచుకుంటున్న ఈ హీరో మరోసారి ఇండో పాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న కథలో నటిస్తున్నాడు.

salman khan

వివిధ వేషాల్లో కనిపించే సల్మాన్ ఎక్కువగా 70 ఏళ్ల వృద్ధుడిగా మెప్పిస్తాడని సమాచారం. సల్మాన్ 20 ఏళ్ల వ్యక్తిగా ఉనప్పట్టి నుంచి మొదలయ్యే భరత్ కథ రెండు దేశాల చుట్టూ తిరుగుతుందట. అలీ అబ్బాస్ జాఫర్ భరత్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దబాంగ్ 3 సినిమాతో కూడా బాయ్ బిజీగా ఉన్నాడు.