ప్రభాస్‌ అభిమానులు, సలార్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. `సలార్‌` టీజర్‌ వచ్చేసింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని ఈ ఉదయం విడుదల చేశారు.

ప్రభాస్‌ అభిమానులు, సలార్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చింది. `సలార్‌` టీజర్‌ వచ్చేసింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని ఈ ఉదయం విడుదల చేశారు. ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఈ టీజర్‌ సాగడం విశేషం. ఇందులో ఓ ఫ్యాక్టరీలో వందల మంది ఒకరిని చంపేందుకు తుపాకులతో చుట్టుముడుతుంటాడు. అయితే ఓ వృద్ధుడు.. వారికో కథ చెబుతాడు. 

`సింహాం, టైగర్‌, చిరుతపులి, ఎలిఫెంట్‌.. వెరీ డేంజరస్‌.. కానీ అది జురాసిక్ పార్క్ లో కాదు. ఆ పార్క్ లో ఒక .. ` అంటూ ప్రభాస్‌ని చూపించడం విశేషం. ఇక కత్తులతో ప్రత్యర్థులపై వీరంగం సృష్టించారు ప్రభాస్‌. యుద్ధ రంగంలో ఆయన విరుచుకుపడ్డారు. దీనికితోడు గూస్‌బంమ్స్ తెప్పించే బీజీఎం.. ఇందులో హైలైట్‌గా నిలిచింది. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్‌ అనే చెప్పాలి. `కేజీఎఫ్‌` తరహాలోనే టీజర్‌ కూడా సాగడం విశేషం. ఆద్యంతం యాక్షన్‌, ఎలివేషన్‌తో ఈ టీజర్‌ సాగడం మరో విశేషం ప్రస్తుతం టీజర్‌ ట్రెండ్‌ అవుతుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుందని ప్రకటించారు మేకర్స్. `పార్ట్ 1ః కాల్పుల విరమణ` అంటూ ప్రకటించారు. టీజర్‌ చివర్లో విలన్‌ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమార్‌ని చూపించడం విశేషం. టీజర్‌ మొత్తం బ్లాక్‌ టోన్‌లో సాగింది. `కేజీఎఫ్‌` టోన్‌లోనే `సలార్‌` టీజర్‌ కూడా ఉండటం విశేషం. మార్నింగ్‌ 5.12కి టీజర్‌ విడుదల చేయడానికి కారణం కూడా అదే అని తెలుస్తుంది. `కేజీఎఫ్‌ 2` మార్నింగ్‌ 5.12కి ముగుస్తుంది. సినిమాలో టైమింగ్‌ ప్రకారం. `సలార్‌` టీజర్‌ని అదే సమయంలో రిలీజ్‌ చేయడంతో దానికి దీనికి సంబంధం ఉందని, దానికి కొనసాగింపుగానే ఈ సినిమా సాగుతుందనే సాంకేతాలిచ్చారు మేకర్స్. 

YouTube video player

ఇందులో ప్రభాస్‌ హీరోగా నటిస్తుండగా, పృథ్వీ రాజ్‌ సుకుమార్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. `కేజీఎఫ్‌`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు. తాజాగా టీజర్‌ని కేవలం ఒకేలా భాషలో విడుదల చేశారు. ఇంగ్లీష్‌ డైలాగ్‌లతోనే టీజర్‌ సాగడం గమనార్హం.