Asianet News TeluguAsianet News Telugu

#Salaar లో యష్? నన్ను మాత్రం ట్రోల్ చేయద్దు..ప్లీజ్

 స‌లార్ మూవీ డిసెంబ‌ర్ 22న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో య‌శ్ గెస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Salaar singer retracts statement about Yash cameo in film jsp
Author
First Published Dec 13, 2023, 2:55 PM IST


 ఇప్పుడు మన మీడియా మొత్తం  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salar)వార్తలతో నిండిపోతోంది.  కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ప్రతిష్టాత్మకగా రూపొందిస్తున్న  ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమోషన్స్ మాత్రం స్పీడు అందుకోలేదు.  ఇప్పటికే ఉన్న ఈ క్రేజ్ చాలు అన్నట్లుగా  ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కిస్మస్  ఎప్పుడు వస్తుంది,సలార్ ను ఎప్పుడు చూస్తామా అంటూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా సలార్ పై సోషల్ మీడియాలో ఓ ప్రాపగాండా ప్రారంభమైంది.  ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో య‌శ్ గెస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ఆ వార్తల సారాంశం. ఈ వార్త‌ల‌పై సినిమా యూనిట్ ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు.రీసెంట్ గా  స‌లార్‌లో య‌శ్ న‌టిస్తోన్నట్లు చైల్డ్ సింగ‌ర్ తీర్థ సుభాష్‌ చెప్పుకొచ్చింది.

రీసెంట్ గా  ఓ ఇంట‌ర్వ్యూలో తీర్థ సుభాష్ మాట్లాడుతూ స‌లార్ సినిమాలో ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్‌తో పాటు య‌శ్ కూడా న‌టిస్తున్న‌ట్లు చెప్పింది. అనుకోకుండా ఆమె య‌శ్ పేరును చెప్పిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. స‌లార్‌లో య‌శ్ ఉన్నాడ‌ని క్లారిటీ రావ‌డంతో అత‌డి అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే సినిమాలోని ట్విస్ట్‌ను రివీల్ చేయ‌డంపై తీర్థ సుభాష్‌ను కొంద‌రు ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. దాంతో స‌లార్‌లో య‌శ్ ఉన్నాడ‌ని చేసిన కామెంట్స్‌పై తీర్థ సుభాష్ సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

‘కేజీఎఫ్ సినిమా చాలాసార్లు చూశాను. కేజీఎఫ్ టీమ్‌కి సంగీత దర్శకుడు సలార్ కూడా పనిచేశారని నాన్న చెప్పారు. అందుకే సలార్ సినిమాలో యష్ అంకుల్ కూడా ఉంటాడని నా మనసులో అనుకున్నాను. అందుకే ఆయన పేరు చెప్పాను అని తెలిపింది. స‌లార్‌లో య‌శ్ రోల్ గురించి చేసిన కామెంట్స్‌పై త‌న‌ను ట్రోల్ చేయ‌ద్ద‌ని కోరింది. తీర్థ సుభాష్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. మాలికాపురం సినిమాతో తీర్థ సుభాష్ ఫేమ‌స్ అయ్యింది. 
 
‘సలార్‌’ను నిర్మిస్తున్న హోంబాలే ఫిల్మ్‌ మాత్రం ఈ వార్తలపై ఇప్పటివరకూ ఏమీ రెస్పాండ్ అవలేదు.మరో ప్రక్క ‘సలార్‌’ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ బిజిగా ఉన్నారట. ప్రభాస్‌ను డైనోసార్‌గా పోలుస్తూ  విడుదల చేసిన ‘సలార్‌’ గ్లింప్స్‌, ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. విదేశాల్లో టికెట్‌ బుకింగ్స్‌ కూడా అయిపోయాయి.   ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ (Salaar: Part 1 Ceasefire)కు ఓపినింగ్స్ ఓ రేంజిలో ఉంటాయనేది నిజం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios