Asianet News TeluguAsianet News Telugu

`సలార్‌` నైజాం రైట్స్.. ఎంతకి అమ్ముడు పోయాయో తెలిస్తే మైండ్‌ బ్లాకే?

`సలార్‌` సినిమాకి సంబంధించిన బిజినెస్‌ లెక్కలు షాకిస్తున్నాయి. తాజాగా నైజాం రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. అయితే వారు రైట్స్ తీసుకున్న అమౌంట్‌ మాత్రం షాకిచ్చేలా ఉంది.

salaar nizam rights with shocking price arj
Author
First Published Nov 17, 2023, 2:29 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లోపాటు ఇండియా మొత్తం వెయిట్‌ చేస్తున్న చిత్రాల్లో ప్రభాస్‌ నటించిన `సలార్‌` ఒకటి. డార్లింగ్‌ నుంచి వస్తోన్న మరో భారీ చిత్రం కావడం, `కేజీఎఫ్‌` తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. రిలీజ్‌ మరో నెల రోజులున్న నేపథ్యంలో టీమ్‌ ప్రమోషన్స్ కార్యక్రమాలను షురూ చేస్తుంది. అందులో భాగంగా సినిమా బిజినెస్‌ లెక్కలు తేల్చుతుంది యూనిట్‌. వరుసగా ఏరియా వైజ్‌ కొన్న బయ్యర్లని ప్రకటిస్తుంది. 

ఇప్పటికే మలయళంలో పృథ్వీరాజ్‌కి చెందిన ప్రొడక్షన్‌ కేరళా రైట్స్ ని దక్కించుకుంది. కన్నడలో సొంతంగానే తన హోంబలే ఫిల్మ్స్ పై రిలీజ్‌ చేస్తున్నారు. మరోవైపు కన్నడలో ఉదయనిధి స్టాలిన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఏపీలో ఐదారు మంది బయ్యర్లు కొన్నారు. జిల్లాల వారికి ఆయా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నైజాం వంతు వచ్చింది. నైజాం రైట్స్ ని ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు. 

అయితే ఎంతకు తీసుకున్నారనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. మైత్రీ `సలార్‌` హక్కులకు సంబంధించిన ఫిగర్‌ లీక్‌ అయ్యింది. భారీ మొత్తానికి నైజాం రైట్స్ ని కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ఫిగర్‌ వింటే మాత్రం మతిపోతుంది. ఏకంగా రూ.90కోట్లకి `సలార్‌` నైజాం రైట్స్ ని మైత్రీ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని సమాచారం. అందులో రూ.65కోట్లు ఎన్‌ఆర్‌ఏ(నార్‌ రిటర్న్ ఎమౌంట్‌) కింద తీసుకున్నారని, మిగిలినది వసూళ్లని బట్టి ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఇది భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్టే అని చెప్పొచ్చు. 

బయ్యర్లకి బ్రేక్‌ ఈవెన్‌ కావలంటే నైజాంలోనే ఈ మూవీ ఏకంగా 130కోట్లు వసూలు చేయాలి. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతుంది. అంత స్థాయిలో సినిమా వసూళ్లు రాబడుతుందా? ఎంత పెద్ద హిట్‌ అయినా ఇది సాథ్యమేనా? అనేది ఆశ్చర్యపరుస్తుంది. మరి ఏ మేరకు వెళ్తుందో చూడాలి. అయితే మైత్రీ వాళ్లు ఇటీవలే డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి దిగారు. దీంతో భారీ సినిమాలను రిలీజ్‌ చేస్తుండటం విశేషం. ఇక `సలార్‌` సినిమాలో శృతి హీరోయిన్‌గా నటిస్తుంది. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. డిసెంబర్‌ 22న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios