ఎప్పుడూ యద అందాల విందు చేసే శ్రీముఖి ఈసారి పంథా మార్చింది. తన ఫోకస్ నాభి, నడుము పై పెట్టింది.
హీరోయిన్ జాబ్ అంత సులభం కాదు. వేళాపాళా లేని వృత్తిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శారీరకంగా మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడాలంటే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే స్లిమ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. హీరోయిన్స్ షేపవుట్ అయితే కెరీర్ ఉండదు. అందుకే తారలు జిమ్స్ లో గంటల తరబడి గడుపుతుంటారు. కఠిన కసరత్తులు చేసి నాజూకు బాడీ సాధిస్తుంటారు.
సన్నజాజి తీగలా ఉండే హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ విషయంలో మినహాయింపు కాదు. వ్యాయామం తన దినచర్యలో భాగంగా ఉంటుంది. అందుకే స్లిమ్ అండ్ ఫిట్ ఫిగర్ మైంటైన్ చేస్తుంది. ఇక జిమ్ లో కేవలం వ్యాయామమే కాకుండా యుద్ధ విద్యలు కూడా ప్రాక్టీస్ చేస్తారు. కిక్ బాక్సింగ్ చేస్తున్న శృతి హాసన్ వీడియో వైరల్ అవుతుంది. సెలబ్రిటీ ట్రైనర్ ఇర్ఫాన్ ఖాన్ పర్యవేక్షణలో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న శృతి హాసన్ వీడియో వైరల్ అవుతుంది. శృతి హాసన్ ఈ వీడియో ఫాన్స్ తో షేర్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత ట్రైనింగ్ తీసుకుంటునట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే... సంక్రాంతి హీరోయిన్ రెండు సూపర్ హిట్స్ శృతి ఖాతాలో పడ్డాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల్లో శృతి హీరోయిన్ గా నటించారు. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య వసూళ్లు దుమ్ముదులిపింది. 2023 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. యావరేజ్ కంటెంట్ అయినప్పటికీ పండగ సీజన్ కలిసొచ్చింది. రెండు మాస్ చిత్రాలను జనాలు ఆదరించారు.
శృతి చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తుండగా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సలార్ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ విలన్ రోల్ చేస్తున్నారు. అలాగే జగపతిబాబు ఒక పాత్ర చేస్తున్నారు. సలార్ ప్రభాస్ కెరీర్లో భారీ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సలార్ విజయంతో శృతి కెరీర్ మరో రేంజ్ కి వెళ్లడం ఖాయం...
