Asianet News TeluguAsianet News Telugu

మైత్రీకి ‘సలార్’ నైజాం రైట్స్.? మునుపెన్నడూ లేనివిధంగా రిలీజ్ కు ప్లాన్..

సలార్ పార్ట్ 1 : సీస్ ఫైర్ చిత్రం మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మూవీ నైజా రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ కూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

Salaar Cease fire Nizam Rights is confirmed for mythri Movie Distributors NSK
Author
First Published Oct 22, 2023, 6:22 PM IST | Last Updated Oct 22, 2023, 6:23 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)   బర్త్ డే వేడుకలకు అంతా సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డార్లింగ్ పుట్టిన రోజు వేడులకు భారీ కటౌట్లు, సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బర్త్ డేను సెలబ్రేట్ చేస్తుండటం విశేషం. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందిందనే చెప్పాలి. 

అదేంటంటే, ఈ చిత్రానికి సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ మూవీ మేకర్స్ వారు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న రికార్డు ధరను మించి ఈ మూవీ హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రూ.65 కోట్లుపై మాటే అంటున్నారు. ఇక రిలీజ్ విషయంలోనూ మైత్రీ వాళ్లు భారీ ప్లానింగ్ చేస్తున్నారంట. 

అసలే డార్లింగ్ సినిమా, పైగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘సలార్’ కావడంతో రోజుకు ఆరు ఆటలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట.  మిడ్ నైట్ 12 : 30 నుంచే షోలు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారంట. థియేటర్ల సంఖ్య కూడా ‘ఆర్ఆర్ఆర్’ కంటే ఎక్కువగా ఉండేలా చూస్తున్నారంట. ఇక భారీ హైప్ ఉండటంతో సినిమా రిలీజ్ విషయంలో ఇలా బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ ను రెడీ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం డార్లింగ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంతో ప్రశాంత్ నీల్ వరల్డ్ మార్కె ట్ టార్గెట్ చేయడంతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. 

చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటికే అంచనాలను పెంచేశాయి. సలార్ రెండు పార్టులు గా రానుంది.  Salaar Cease Fire టైటిల్ తో మొదటి భాగాన్ని విడుదల చేస్తున్నారు. అన్నీ బాగుంటే సెప్టెంబర్ 28నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిందీ చిత్రం. మరింత బెస్ట్ అవుట్ పుట్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఫృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా చేశారు. హోంబలే ఫిల్స్ నిర్మిస్తోంది. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios