జబర్దస్త్ షోలో కొత్త యాంకర్ సౌమ్య రావు తన వంతు వినోదం, గ్లామర్ పంచుతూ అలరిస్తోంది. గతంలో అనసూయ, రష్మీపై ఏ తరహాలో సెటైర్లు వేసి నవ్వించే ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా అదే ఫార్ములా కొనసాగుతోంది.
జబర్దస్త్ షోలో కొత్త యాంకర్ సౌమ్య రావు తన వంతు వినోదం, గ్లామర్ పంచుతూ అలరిస్తోంది. గతంలో అనసూయ, రష్మీపై ఏ తరహాలో సెటైర్లు వేసి నవ్వించే ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా అదే ఫార్ములా కొనసాగుతోంది. జబర్దస్త్ సౌమ్యపై సెటైర్లు పేలుతున్నాయి.
తాజాగా జబర్దస్త్ షోలోకి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, విరూపాక్ష చిత్ర యూనిట్ హాజరయ్యారు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, దర్శకుడు కార్తీక్ దండు జబర్దస్త్ షోకి హాజరయ్యారు. జబర్దస్త్ షో కి రాగానే సాయిధరమ్ తేజ్ యాంకర్ సౌమ్య రావుపై సెటైర్లతో విరుచుకుపడ్డాడు.
సౌమ్య రావు అందమైన చీరకట్టులో ఏంజిల్ లా మెరిసిపోయింది. సాయిధరమ్ తేజ్ సౌమ్య రావు వైపు చూస్తూ ఏంజిల్స్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నా అని తెలిపాడు. దీనితో సౌమ్య రావు మురిసిపోయింది. వెంటనే సాయిధరమ్ తేజ్..మీ గురించి కాదు లేండి అని అనడంతో ఆమె గాలి తీసినట్లు ఐంది.
అనంతరం రాకెట్ రాఘవ సాయిధరమ్ తేజ్ ని అతిగా పొగడబోయి పరువు తీసుకున్నాడు. సాయిధరమ్ తేజ్ సర్.. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాము అని రాకెట్ రాఘవ అన్నారు. పక్కనే ఉన్న కమెడియన్ చెప్పుతో కొడతా.. ఎవర్ని చూస్తూ ఎవరు పెరిగారు అంటూ అతడి వయసు గుర్తు చేశాడు. సాయిధరమ్ తేజ కూడా తనదైన శైలిలో జోకులు వేస్తూ ఈ షోలో సందడి చేసారు. ఇది కేవలం ప్రోమో మాత్రమే. కంప్లీట్ ఎపిసోడ్ ఏప్రిల్ 20న ప్రసారం కానుంది.
