శేఖర్ కమ్ముల  ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసేసిన నటి సాయిపల్లవి..అప్పటి నుంచి వరస హిట్లతో టావీవుడ్ ఇండస్ట్రిని ఏలుతోంది. విరాట పర్వంతో త్వరలో రానాతో కలిసి పలకరించనున్న ఆమె ఈ గ్యాప్ లో తెలుగు ప్రేక్షకుల ముందు అనుకోని అతిథిగా రాబోతుంది. 

వివరాల్లోకి వెళితే... సాయిపల్లవి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అనుకోని అతిథి’గా రానున్నారు. ఆమె నటించిన మలయాళ చిత్రం ‘అధిరన్‌’. ఫాహద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌ రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ను తెలుగులో ‘అనుకోని అతిథి’గా అనువదించారు నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌. జయంత్‌ ఆర్ట్స్‌ పతాకంపై సినిమా విడుదల కానుంది. కేరళలో 1970లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది.

నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ మాట్లాడుతూ ‘‘త్వరలో ట్రైలర్ ని, తర్వాత చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మిక్సింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. 

రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతికృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీన్వాస్‌, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పడిమి కాల్వ, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, సంగీతం: పిఎస్‌ జయహరి.