చేసినవి తక్కువ సినిమాలే అయినా సాయిపల్లవి సినిమా అంటే ఓ మంచి కథ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ కి కలిగింది.
నేచురల్ బ్యూటీ, లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి ప్రత్యేకమైన ఇమేజ్,గుర్తింపు అభిమానుల్లో ఉంది. ఆమె సినిమా అంటే ఓసారి అయినా చూద్దామనుకుంటారు చాలా మంది. అందుకే చాలా సెలిక్టివ్ గా వెళ్తూంటుంది సాయి పల్లవి. ముఖ్యంగా తెలుగులో ఫిదా సినిమాతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత కూడా చాలా చాలా జాగ్రత్తగా కథలు చూసుకుని సినిమాలు చేసింది. చేసినవి తక్కువ సినిమాలే అయినా సాయిపల్లవి సినిమా అంటే ఓ మంచి కథ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ కి కలిగింది.
తన సహజ అందం, నటన, డ్యాన్సుతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఈ మలయాళ భామ.
ప్రేమమ్ చిత్రంతో కుర్రకారును ఎంతోగానో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎక్స్‌పోజింగ్ అమడ దూరంలో ఉంటూ..అచ్చమైన తెలుగింటి అమ్మాయిల కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో సాయిపల్లవి నటించింది తక్కువ సినిమాలే అయినా..అన్నీ ఆమెను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. సాయిపల్లవి ఎక్కువగా లవ్ స్టోరీ మూవీస్ లోనే కనిపించింది. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ వంటి ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఆమె తెలుగులో మరో కొత్త సినిమా కమిటైందని సమాచారం.
సాయిపల్లవి సినిమాల విషయంలో స్పీడు పెంచింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘తండేల్’ చేస్తూనే హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తోంది. అలాగే తమిళంలో ‘అమరన్’లో నటిస్తోంది. అయితే ఇప్పుడామె కొత్తగా మరో కథ విన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
అందమైన ప్రేమకథతో రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రం కోసం నాయికగా సాయిపల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని.. సినిమా విషయంలో ఆమె సానుకూలంగా ఉందని సమాచారం. దీన్ని వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి గతంలో విజయ్ దేవరకొండ సరసన ఆఫర్ వచ్చినా ఆమె చేయలేదని వినికిడి. ముందుగా ఆమెకు విజయ్ సరసన డియర్ కామ్రేడ్ లో అవకాశం వచ్చింది. తర్వాత ఖుషి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. కానీ వీటిని సాయిపల్లవి తిరస్కరించింది. రూ.కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా నటించనని సూటిగా నిర్మాత, దర్శకులకు తేల్చిచెప్పేసింది. కాంట్రవర్సీలతోపాటు రొమాంటిక్ సన్నివేశాలు విజయ్ సినిమాల్లో కచ్చితంగా ఉంటాయి. దీనివల్ల తన గుడ్ విల్ దెబ్బతింటుందని సాయిపల్లవి భావిస్తోంది.
