'ఫిదా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే అందరినీ ఫిదా చేసేసింది. మలయాళీ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇటు తెలుగులో అటు కోలివుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇటీవల ఆమె నటించిన 'పడి పడి లేచే మనసు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా.. సాయి పల్లవి నటనకి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో సూర్య హీరోగా నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది ఈ బ్యూటీ.

తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో యాంకర్ ప్రేమ పెళ్లి చేసుకుంటారా..? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా..? అని ప్రశ్నించగా.. దానికి సాయి పల్లవి పెళ్లి చేసుకొనే ఆలోచన లేదని, తల్లితండ్రులను కంటికిరెప్పలా చూసుకుంటూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని షాకింగ్ కామెంట్స్చేసింది.

ఇది చూసిన ఆమె అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.