సాయి పల్లవి చాలా రోజుల తర్వాత బయటకొచ్చింది. ఆమె `నిజం` టాక్‌ షోలో పాల్గొంది. ఇందులో `మీటూ` మూమెంట్‌పై, అలాగే ఎన్టీఆర్‌, బన్నీ, చరణ్‌లతో డాన్సు చేయడంపై స్పందించింది.

లేడీపవర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు సాయిపల్లవి. ఏకంగా డైరెక్టర్‌ సుకుమారే ఈ మాట అనడం విశేషమైతే, ఓ పెద్ద ఈవెంట్‌లో ఆయన్నుంచి ఈ మాట రావడం మరో విశేషం. అద్భుతమైన నటన, అత్యద్బుతమైన డాన్సులతో అదరగొడుతుంది. ఆమెతో డాన్సులు చేయాలని చిరంజీవి లాంటి పెద్ద స్టార్లే కోరుకోవడం విశేషం. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న సాయిపల్లవి తెలుగులో కొంత బ్రేక్‌ ఇచ్చింది. తనకు నచ్చిన చిత్రాలనే చేసే ఆమె ఇప్పుడు ఒకటి రెండు తమిళ చిత్రాలతో అలరిస్తుంది. తెలుగులో ఆమె `పుష్ప2`లో నటించబోతుందని సమాచారం. 

ఇదిలా ఉంటే తాజాగా సాయిపల్లవి `మీటూ` ఉద్యమంపై స్పందించింది. ఐదేళ్ల క్రితం మీటూ ఉద్యమం పెద్ద దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ లో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం నెమ్మదిగా సౌత్‌కి పాకి పెద్ద సునామీని సృష్టించింది. అనేక స్టార్ల పేర్లు తెరపైకి రావడం గమనార్హం. సంచలనంగా మారిన ఈ మీటూ ఉద్యమం ఇప్పుడు సైలెంట్ అయ్యింది. అడపాదడపా ఒకరిద్దరు నటీమణులు స్పందిస్తూ బాంబ్‌లు పేల్చతున్నారు. అయితే దీనిపై ఫస్ట్ టైమ్‌ సాయిపల్లవి స్పందించింది. ఎవరూ చూడని కోణాన్ని ఆమె బయటపెట్టి షాకిచ్చింది. 

తాజాగా సాయిపల్లవి.. సింగర్‌ స్మిత హోస్ట్ గా రన్‌ అవుతున్న `నిజం` టాక్‌ షోలో పాల్గొంది. సోనీ లైవ్స్ లో ఇది ప్రసారం కానుంది. ఇందులో చిరంజీవితో సహా బిగ్‌ స్టార్స్ పాల్గొంటూ సందడి చేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో సాయిపల్లవి గెస్ట్ గా వచ్చారు. ఆమె గురించి గొప్పగా ఇంట్రో ఇచ్చింది స్మిత. మంచి మెడికో అని చెప్పకపోవడంతో సాయిపల్లవి పంచ్‌ లు వేసింది. దీంతో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ ఈ ముగ్గురిలో ఎవరితో డాన్సు చేయాలని ఉంది అని ప్రశ్నించగా, కాస్త ఆలోచించి, కాస్త సైగలు చేస్తూ ఆ ముగ్గురి నాతో కలిసి డాన్సు చేస్తే బాగుంటుంది` అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. దీంతో షోలో నవ్వులు పూసాయి. 

అనంతరం మీటూపై చర్చ వచ్చింది. `ఒకప్పుడు మీటూ సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియాలో ఎంతో మంది మహిళలు తాము ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని స్మిత అడిగిన ప్రశ్నకి సాయిపల్లవి స్పందిస్తూ, మీరు శారీరకంగా వేధింపులకు గురి కాకపోవచ్చు, కానీ మీ మాటలతో పక్క వారిని ఇబ్బంది పెట్టినా అది వేధింపులతో సమానమే అవుతుంది` అని చెప్పి షాకిచ్చింది. తాజాగా విడుదలైన `నిజం` ప్రోమోలో ఇది హైలైట్‌గా మారి, హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

View post on Instagram

ఇక సాయిపల్లవికి ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేవు. ఆమె చివరగా `విరాటపర్వం` చిత్రంలో నటించింది. రానాతో కలిసి నటించిన చిత్రమిది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. కమర్షియల్‌గా ఆదరణ పొందలేకపోయింది. ఆ తర్వాత `గార్గి` చిత్రంతోనూ మెరిసింది. ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో శివ కార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తుంది. ఇది కమల్‌ హాసన్‌ నిర్మిస్తుండటం విశేషం. మరోవైపు తెలుగులో బన్నీతో `పుష్ప2`లో నటించబోతుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.