సాయిపల్లవి ప్రస్తుతం `విరాటపర్వం`లో వెన్నెలగా నటిస్తుంది. దీంతోపాటు నాని హీరోగా రూపొందుతున్న `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రంలో హీరోయిన్‌గాచేస్తుంది. అలాగే `లవ్‌ స్టోరి`లోనూ నటిస్తుంది. 

సాయిపల్లవి సహజమైన అందం, సహజమైన నటి. మలయాళంలో నటించిన `ప్రేమమ్‌` చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. అదే ఊపులో తెలుగులో `ఫిదా` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా తొలి సినిమాతోనే స్టార్‌ అయిపోయింది. కమర్షియలిటీకి అతీతంగా విభిన్నమైన పాత్రలున్న భిన్నమైన సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తనకంటూ ప్రత్యేకతని చాటుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

`విరాటపర్వం`లో వెన్నెలగా నటిస్తుంది. దీంతోపాటు నాని హీరోగా రూపొందుతున్న `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రంలో హీరోయిన్‌గాచేస్తుంది. అలాగే `లవ్‌ స్టోరి`లోనూ నటిస్తుంది. నేడు(మే9) సాయిపల్లవి బర్త్ డే. తన 29వ పుట్టిన రోజుని జరుపుకుంటోన్న సాయిపల్లవి బర్త్ డేని పురస్కరించుకుని `విరాటపర్వం` నుంచి కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె గోడపై కమ్యూనిస్ట్ అక్షరాలు దిద్దుతుంది. ఇందులో సాయిపల్లవి వెన్నెలగా నక్సల్‌ సానుభూతి పరురాలిగా, హీరో రానాకి లవ్ ఇంట్రెస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

సాయిపల్లవి లుక్‌ని పంచుకుంటూ దర్శకుడు వేణు ఉడుగుల చెబుతూ, `ఈ సంక్షోభ సందర్భాన మీకు పుట్టిన రోజు విషెస్‌ చెప్పడం సహేతుకం అనిపించలేదు. అందుకే విరాటపర్వం పోస్టర్‌ని కూడా విడుదల చేయలేదు. మీ అభినయ విశేషముతో ఈ రత్నఖచిత భువనాన తీరొక్క పూల కవనమై వెలుగొందే మీలాంటి హృదయగత జీవులంతా బాగుండాలి. కాలానికి ఎదురీది నిలబడాలి. జీతే రహో సాయిపల్లవి` అని పేర్కొన్నాడు దర్శకుడు. ఇందులో రానా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా, ప్రియమణి, నివేదా పేతురాజ్‌, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది.

మరోవైపు నాని హీరోగా రూపొందుతున్న `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రం నుంచి సాయిపల్లవి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో ఆమె దేవి మాత గెటప్‌లో పూనకాలు క్రియేట్‌చేస్తుంది. ఈ సందర్భంగా సాయిపల్లవికి టీమ్‌ బర్త్ డే విషెస్‌ తెలిజేసింది. అమ్మోరు తల్లి అవతారంలో సాయిపల్లవి లుక్‌ గూస్‌బమ్స్ వచ్చేలా చేస్తుంది. ఈ సినిమాకి రాహుల్‌ సాంక్రిత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Scroll to load tweet…