'శైలజారెడ్డి అల్లుడు' డిజాస్టర్ దర్శకుడు మారుతి ని బాగా వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఎంతలా అంటే ఆ సినిమా  తరువాత ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేదు మారుతి. వాస్తవానికి ఈ చిత్రం తరువాత నాని తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. నాని కూడా భలే భలే మొగాడివోయ్ ని గుర్తు చేసుకుని సరే అన్నాడు కానీ డేట్స్ ఇచ్చే పరిస్దితి   కనిపిచండం లేదు. వరస ప్రాజెక్టులతో నాని దూసుకుపోతున్నాడు. 

ప్రస్తుతం ఆయన జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత విక్రమ్ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. దాంతో మారుతీ మరింత ఆలస్యం అయ్యెలాఉందని తన కొత్త చిత్రాన్ని మెగా హీరో  సాయి ధరమ్ తేజ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

ఇక ప్రస్తుతం సాయి ధరమ్  'చిత్రలహరి'లో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తికావచ్చింది. అయితే సాయి మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడు.  కాబట్టి ఈ చిత్రం తరువాత మారుతి తో సినిమా ను మొదలు పెడతాడో లేదో చూడాలి.