సాయి ధరం తేజ్ డేటింగ్ చేస్తున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో తన కో స్టార్ లారిస్సా బోనేసితో సాయి ధరం తేజ్ సన్నిహితంగా ఉండేవాడని, ఆమెని డేటింగ్ కి కూడా పిలిచాడని వార్తలు వినిపించాయి.

ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు ముంబై వర్గాల సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. ధరం తేజ్ 'తిక్క' సినిమాలో బ్రెజిలియన్ బ్యూటీ లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మెగా మేనల్లుడు ఆమెను డేటింగ్ కి పిలిచాడట. కానీ లారిస్సా మాత్రం తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి తప్పించుకుందట.

అయితే 'తిక్క' సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. 'నెక్స్ట్ ఏంటి?' సినిమాలో ఛాన్స్ సంపాదిస్తే అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో అమ్మడు ముంబైకి షిఫ్ట్ అయిపొయింది. అక్కడే మోడలింగ్ అంటూ కాలం గడుపుతోంది. ఆమెని చూడడం కోసం ఈ మెగాహీరో ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారని టాక్. సాయి ధరం తేజ్ ఫోటోని లారిస్సా బోనేసి ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీరి గురించి తెలిసిన కొందరు మాత్రం ఇది సీరియస్ రిలేషన్షిప్ కాదని అంటున్నారు. మరి సాయి ధరం తేజ్ ఈ హీరోయిన్ ని ఎందుకు కలిసినట్లో..?