రెజీనాతో ప్రేమలో పడిన సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో ఒప్పించే ప్రయత్నం తన తల్లితో రెజినాను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం
మెగాీ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించిన రూమర్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునే వున్నాయి. ముఖ్యంగా ప్రేమ పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ దారిలోనే ఆయన ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నడుస్తున్నాడంటూ ఎప్పటినుంచో గుసగుసలు వస్తున్నా ఆ అఫైర్ పెళ్లి వరకు వచ్చినట్లు ఫిలింనగర్‌లో తాజాగా గుసగుసలు ప్రారంభం కావడం మళ్లీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ టౌన్ గా మారింది.
ఆమధ్య సాయి ధరమ్ తేజ్ రెజీనాల మధ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలు వచ్చిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ అప్పట్లో మీడియాను వార్తలతో కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈవార్తలు అన్నీ రూమర్స్ అంటూ ఖండనలు కూడ వచ్చాయి. అయితే మళ్ళీ తేజ్ రెజీనాల మధ్య మళ్ళీ ప్రేమ యూటర్న్ తీసుకోవడం మొదలైంది అంటూ తాజాగా వార్తలు ఊపు అందుకుంటున్నాయి. దీనికి కారణం రెజీనాను పెళ్లి చేసుకోవాలని సాయిధరమ్ తేజ్ బలంగా ఫిక్స్ అయ్యాడట.
రెజీనాతో ప్రేమ విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లినట్టు కొత్తగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే సాయి ధరమ్ తేజ్ తన తల్లిని కుటుంబ సభ్యులను ఒప్పించే పనిలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి విషయంలో రెజీనా మరో మెలిక పెట్టినట్లు మరో వార్త వెలుగులోకి వచ్చింది.
కెరియర్ పీక్‌లో ఉన్నందున్న మరికొన్ని రోజులు ఆగుదామనే ప్రతిపాదన సాయి ధరమ్ ముందుకు రెజీనా తెచ్చిందట. అంతేకాదు ఇప్పటికిప్పుడు పెళ్లంటే కష్టమని చెప్పిందని టాక్. ఈ విషయంలో ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఫిలింనగర్ లో గాసిప్పులు తెగ హడావిడి చేస్తున్నాయి. మరి ఈ కథ ఎటు తిరుగుతుందో చూడాలి.
