Asianet News TeluguAsianet News Telugu

గుమ్మడికాయ కొట్టేశారు.. షూటింగ్ పూర్తిచేసకున్న సాయితేజ్ విరూపాక్ష సినిమా

మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష టీమ్. సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుని.. సైలెంట్ గానే షూటింగ్ కు పేకప్ చెప్పేశారు టీమ్. 

Sai Dharam Tej Virupaksha Shooting Completed JMS
Author
First Published Mar 31, 2023, 2:00 PM IST

 మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ఈమధ్య కాస్త స్లో.. అయినా.. సాలిడ్ హిట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు.  డిఫరెంట్‌ జానర్‌లో సినిమాలు ప్లాన్ చేస్తూ.. తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.  అయితే మెగా హీరో ఎంత ప్రయత్నం చేస్తున్నా.. ఆయనకు పెద్దగా గుర్తింపు రావడంలేదు. హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడే కాని.. స్టార్ డమ్ కు మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉన్నాడు. టైర్ 2 హీరోల లిస్ట్ లోనే ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.  ఇక ఈమెగా హీరో సినిమాలు ఎలా ఉన్నా చూస్తారు ఆడియన్స్.. కాని కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోతున్నాయి సాయి ధరమ్ తేజ్ సినిమాలు. 

ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి సెట్స్ మీద ఉన్నాయి.అందులో విరూపాక్ష కూడా ఒకటి. కార్తిక్‌ దండు ఈ సినిమాతో  దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి ఈసినిమాపై ఇక దానికి తగ్గట్టే.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్.. మూవీపై అంచనాలు పెంచేసింది. మిస్టరీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈమూవీ ఏప్రిల్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. 

రీసెంట్ గాఈ సినిమా షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది. అయితే ఒక్క పాట మాత్రమే మిగిలి ఉండగా..మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. షూటింగ్ కు పేకప్ చెప్పగానే..  కాస్ట్‌ అండ్‌ క్రూతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో  షేర్‌ చేశారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ఊరిలో మిస్టరీగా మారిన చావుల గుట్టును హీరో వెళ్లి ఎలా విప్పాడు అనేది సినిమా కథ. ఈక్రమంలో హీరోకు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి.. వాటిని  అతను ఎలా ఫేస్ చేశాడు అనేది సినిమాలో చూపించబోతున్నారు. 

ఇక ఈసినిమాలో సాయి ధరమ్ తేజ్ జోడీగా.. సంయుక్తా హెగ్డే నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు.  ఇక ఈసినిమాతో పాటు సాయితేజ్.. ఫస్ట్ టైమ్ పవర్ స్టార్ తో కలిసి వినోదయ సితం రీమేక్‌లో నటిస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios