వరుసగా ఫ్లాప్ సినిమాలతో ఇబ్బందిపడ్డ నటుడు సాయి ధరం తేజ్ ఇటీవల 'చిత్రలహరి' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న తేజు తన వ్యక్తిగత విషయం గురించి మీడియాతో పంచుకున్నాడు.

తాను పదో తరగతి చదివేప్పుడే అమ్మానాన్న విడాకులు తీసుకున్నారని తేజు చెప్పాడు. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో పెళ్లైన 15 ఏళ్లకు విడిపోయినట్లు చెప్పాడు. తండ్రి లోటు తెలియకుండా తనను, తమ్ముడిని అమ్మ పెంచిందని మెగాహీరో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం తన తండ్రి పశ్చిమగోదావరి జిల్లాలో తన సొంతూరులో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ ఆయనతో టచ్ లో ఉన్నట్లు, ఆయన సినిమా రంగానికి చెందిన వారు కాకపోవడంతో సినిమాల గురించి చర్చించుకోమని తెలిపారు. నాన్నతో విడిపోయిన తరువాత 2011లో అమ్మకి రెండో పెళ్లి చేసినట్లు చెప్పారు.

తాను, తమ్ముడు పెళ్లిళ్లు చేసుకుంటే అమ్మ ఒంటరిగా ఉంటుందనే భావనతో రెండో పెళ్లికి ఒప్పించామని తెలిపాడు. తన తల్లిని పెళ్లాడిన వ్యక్తి కంటి డాక్టర్ అని.. చాలా మంచివాడని.. అమ్మని బాగా చూసుకుంటారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తను, తన తమ్ముడు ఆయనతోనే కలిసి ఉన్నామని స్పష్టం చేశారు.