Asianet News TeluguAsianet News Telugu

సాయి తేజ్ ‘రిప‌బ్లిక్‌’ రిలీజ్ డేట్ ఖరారు

మెగా కాంపౌండ్ నుండి ఈ సంవత్సరం సినిమాల వర్షం కురవనుంది.  ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మెగా స్టార్ ఆచార్య, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, రామ చరణ్ ఆర్ఆర్ఆర్, వరుణ్ తేజ్ గని, అల్లు అర్జున్ పుష్ప, వైష్ణవ్ తేజ్ ఉప్పెన ఇలా ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. రిలీజ్ డేట్స్ ప్రకటించేసారు. ఇప్పుడు సాయి తేజ్ కొత్త సినిమా కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. 

Sai Dharam Tej Republic Movie Release Date Confirmed jsp
Author
Hyderabad, First Published Feb 1, 2021, 7:50 PM IST

వైవిధ్యమైన చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే యువ హీరోల్లో సుప్రీమ్ హీరో సాయితేజ్ ముందు వరుసలో ఉంటారు. అందువ‌ల్లే ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస విజయాల‌ను సాయితేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు భిన్నంగా సాయితేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘రిప‌బ్లిక్‌’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటిక‌ల్ మూవీని  తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ‘రిప‌బ్లిక్‌’ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది. 

రీసెంట్‌గా విడుద‌ల చేసిన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్ష‌కుల నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు  మాట్లాడుతూ - ‘‘సాయితేజ్ హీరోగా దేవ్ క‌ట్టా‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘రిప‌బ్లిక్‌’ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.  

న‌టీన‌టులు:
సాయితేజ్
ఐశ్వ‌ర్యా రాజేశ్‌
జ‌గ‌ప‌తిబాబు
ర‌మ్య‌కృష్ణ‌
సుబ్బ‌రాజు
రాహుల్ రామ‌కృష్ణ‌
బాక్స‌ర్ దిన

సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు
క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: దేవ్ క‌ట్టా
స్క్రీన్‌ప్లే: దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
ఎడిట‌ర్‌: కె.ఎల్‌.ప్ర‌వీణ్‌
ఆర్ట్‌: శ్రీకాంత్ రామిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: స‌తీశ్ బీకేఆర్‌
పాట‌లు: సుద్దాల అశోక్ తేజ‌, రెహ‌మాన్‌
 

Follow Us:
Download App:
  • android
  • ios