సాయిధరమ్‌ తేజ్‌ మళ్లీ తన పేరుని మార్చుకున్నారు. అంతేకాదు `గంజా శంకర్‌` సినిమా ఆగిపోయిందనే వార్తలపై స్పందించారు. సెటైర్లతో రెచ్చిపోయాడు. 

సాయిధరమ్‌ తేజ్‌ మరోసారి పేరు మార్చుకున్నాడు. ఆయన అసలు పేరు సాయిధరమ్‌ తేజ్‌. మధ్యలో ధరమ్ తీసేసి సాయిగా పెట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు మరోసారి మార్చుకున్నారు. తన పేరు మధ్యలో అమ్మ పేరుని యాడ్‌ చేసుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ అమ్మ పేరు విజయ దుర్గ. దుర్గ వచ్చేలా `సాయి దుర్గ తేజ్‌` గా మార్చుకున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన `సత్య` అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు. సైనికుల భార్యల స్టోరీతో రూపొందిన షార్ట్ ఫిల్మ్ ఇది. నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమిది. మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ `సత్య` సినిమా విశేషాలను తెలిపారు. ఈ సందర్భంగా తన పేరుని మార్చుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ రోజు నుంచి తన పేరులో అమ్మ యాడ్‌ అవుతుందని, సాయి దుర్గ తేజ్‌గా మార్చుకుంటున్నట్టు తెలిపారు. ఇకపై అమ్మ తనతోనే ఉంటుందని వెల్లడించారు. నాన్న తన పేరులో ఉంటాడు. అమ్మ కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో పేరు మార్చుకుంటున్నట్టు వెల్లడించారు సాయి తేజ్‌. 

ఈ సందర్భంగా ఆయన `గంజా శంకర్‌` సినిమాపై రియాక్ట్ అయ్యారు. ఈ మూవీ ఆగిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి. టైటిల్‌ విషయంలో డ్రగ్స్ అధికారులు నోటీసులు కూడా పంపించారు. దీనిపై రిపోర్టర్‌ ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ సెటైర్లు పేల్చారు. `గంజా శంకర్‌` ఉందా ఆగిపోయిందా తనకు తెలియదని, మీరు చెబితేనే తెలుస్తుందన్నారు. ముఖ్యంగా కొన్ని వెబ్‌ సైట్లలో చూశాక ఆ విషయం తెలిసిందని, ఏదైనా మీరు చెబితేనే తెలుస్తుందని పరోక్షంగా సెటైర్లు పేల్చారు. ఆ సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయనేది ఆయన ఉద్దేశ్యంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది తనకు సమాచారం లేదని ఆయన ఫైనల్‌గా చెప్పారు.

అయితే సినిమా ఆగిపోయిందని చివరికి క్లారిటీ ఇచ్చాడు. మరో రిపోర్టర్‌ ప్రస్తావన తెస్తూ వాళ్లు ట్వీట్‌ వేయడం వల్లే తన సినిమా ఆగిపోయిందన్నారు. సరదాగా మాట్లాడుతూనే వేయాల్సిన వారికి పంచ్‌లు విసిరారు సాయిధరమ్‌ తేజ్‌. ఈ సందర్భంగా `సత్య` షార్ట్ ఫిల్మ్ గురించి చెబుతూ, దేశభక్తి కోసం ఈ మూవీ చేసినట్టు తెలిపారు. సైనికుడు డ్యూటీకోసం బార్డర్‌కి వెళ్లినప్పుడు ఒంటరిగా ఉన్న మహిళ పడే స్ట్రగుల్‌, క్షోభని, అవమానాలు ఎలా ఉంటాయనేది తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ మూవీ చేసినట్టు తెలిపారు.

 దీంతోపాటు తన బెస్ట్ ఫ్రెండ్‌ నవీన్‌ విజయ్‌ కృష్ణ కోసం, ఆయన ప్రతిభని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశ్యంతో చేసినట్టు తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్ తో తాను ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. అమ్మ పేరుతోనే విజయ దుర్గ ప్రొడక్షన్‌ని స్థాపించినట్టు వెల్లడించారు. `సత్య` షార్ట్ ఫిల్మ్ ని ఈ బ్యానర్‌పైనే దిల్‌రాజుతో కలిసి నిర్మించారు. దీన్ని త్వరలో యూట్యూబ్‌, ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. 

Read more: #Bhimaa:‘భీమా’ఎంతకు అమ్మారు, బ్రేక్ ఈవెన్ ఎంత?! రికవరీ అవుతుందా