ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన (Ramabanam) ‘రామబాణం’ కూడా నిరాశపరిచింది. ఈ క్రమంలో ‘భీమా’ సినిమాకి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు.
ఎప్పటిలాగే గోపీచంద్ తన స్టైల్ లో ... పక్కా కమర్షియల్ ప్యాక్డ్ సినిమా గా 'భీమా' అంటూ వచ్చారు. కన్నడ సక్సెస్ ఫుల్ డైరక్టర్ హర్ష తో జోడి కట్టిన చేసిన ఈ చిత్రం సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ తో సాగింది. టీజర్, ట్రైలర్ అందులోని ఫాంటసీ ఎలిమెంట్ చూసి ఏదో కొత్తదనం వుందనే నమ్మకంతో థియేటర్స్ కు వచ్చిన వాళ్లకు రొటీన్ కమర్షియల్ సినిమానే చూపించారు. మారిన ప్రేక్షకుడుకి తగినట్లుగా సినిమా లేదని విమర్శలు వచ్చినా, బి,సి సెంటర్లలో సినిమాకు మంచి ఓపినింగ్స్ దక్కాయి. , మాస్ సెంటర్స్ లో సినిమాకి మంచి ఓపెనింగ్స్ కనిపిస్తూ ఉండగా…. ఏ సెంటర్స్ లో మాత్రం బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. ఈ భీమా గోపీచంద్ కి ఏ మేరకు కమర్షియల్ విజయాన్ని ఇచ్చిందనేది తెలియాలంటే మాత్రం వీకెండ్ రెండు రోజులు వెయిట్ చేయాలి. ఇక ఈ చిత్రం థియేటర్ బిజినెస్ విషయానికి వస్తే....
గోపీచంద్ గతంలో ఇదే బ్యానర్లో (Pantham) ‘పంతం’ సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అది సక్సెస్ కాలేదు. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన (Ramabanam) ‘రామబాణం’ కూడా నిరాశపరిచింది. ఈ క్రమంలో ‘భీమా’ సినిమాకి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. ‘భీమా’ థియేట్రికల్ బిజినెస్ చూస్తే ఆ విషయం అర్దమవుతుంది.:
నైజాం 3.40 cr
సీడెడ్ 1.35 cr
ఆంధ్ర(టోటల్) 4.20 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 8.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.70 cr
వరల్డ్ వైడ్(టోటల్) 10.65 cr
ట్రేడ్ నుంచి అందుతున్న ఈ లెక్కల ప్రకారం ‘భీమా’ (Bhimaa) చిత్రానికి రూ.10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇప్పుడున్న టాక్ తో అయితే కొద్దిగా కష్టమే. ఏమన్నా ఈ రెండు రోజుల్లో పికప్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే తప్ప టార్గెట్ అందుకోవడం కష్టం.
ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్.. కాకపోతే కొంచెం సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా. గోపీచంద్ సరసన (Malvika Sharma) మాళవిక శర్మ, (Priya Bhavani Shankar) ప్రియా భవానీ శంకర్.. లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై కెకె రాధామోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని నిర్మించారు.
